Cyberabad Police: సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ. ఈ సమయంలో అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శించడానికి అనువైన సమయం. అందుకే, సైబరాబాద్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి ఊరికి వెళ్లే వారికి పోలీసులు ఇచ్చిన సూచనలు ఇవే..
Also Read: Software Engineer Suicide: పెళ్లయి నెల రోజులు కాకముందే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్..
* దూర ప్రాంతాలకు వెళ్ళే వారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నంబర్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్‌కు తెలపాలి. దాంతో పోలీసులు, వారి ఇంటి పై నిఘాను ఏర్పాటు చేస్తామని పోలీసులు తెలిపారు.
* మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని.. ఇంటి పక్కన మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వారికి చెప్పడం మంచిది.
* సైబరాబాద్ పోలీసుల CSR సహకారంతో సీసీ కెమెరాలు ఇన్‌స్టాల్ చేస్తారు. ప్రజలు కూడా తమ కాలనీలలో, ఇళ్లలో, పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది.
* విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కార్లలో ఉంచవద్దు. వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడం మంచిది.
* బంగారు నగలు, నగదు వంటి విలువైన వస్తువులను వెళ్ళిపోతున్నప్పుడు మీ వెంట తీసుకెళ్లడం ఉత్తమం.
* ఇంటి తలుపులకు హై ఎండ్ సెక్యూరిటీ లాక్ సిస్టం ఉపయోగించాలి. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది.
* మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్లైన్ లో ఎప్పటికప్పుడు చూసుకొంటూ వుండాలి. మీ ఇంటికి వచ్చే, వెళ్ళే దారులు ఇంకా ఇంటిలోపల కెమెరాలు అమర్చుకొని DVR కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో పెట్టుకోండి.
* ఇంట్లో మోషన్ సెన్సర్ల లైట్లు ఉపయోగించడం కూడా మంచిది. ఇవి చీకటి సమయంలోను పనిచేస్తాయి.
* అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, వాటి గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
* సంక్రాంతి సమయంలో చుట్టుపక్కల వారికి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు మీ ఇంటి వివరాలు తెలియజేయండి.
Also Read: BSNL Offer: డేటా అవసరం లేదా.? కేవలం కాల్స్ కోసం బెస్ట్ ఆఫర్ ఇదే..
* విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు.
* సాధారణంగా సరైన భద్రతా ప్రమాణాలు పాటించని ఇండ్లు, చీకటి ప్రదేశం, పాత గ్రిల్స్, బలహీనమైన తాళాలు ఉన్న ఇండ్లలో దొంగలు పడే అవకశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, కొత్త వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
* ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. లేదా ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి.
* మీరు బయటికి వెళ్ళిపోతున్నా, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఇతరులతో షేర్ చేయడం మంచిది కాదు. దీనివల్ల దొంగలు మీరు ఎక్కడున్నారో తెలిసి చర్యలు తీసుకోవచ్చు.
* కాలనీలో కమిటీలు ఏర్పాటుచేసి, వాటి ద్వారా సీసీ కెమెరాలు, వాచ్‌మెన్‌ల సహకారంతో నిఘా ఉంచుకోవాలి.
* కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ లేదా సైబరాబాద్ పోలీసు వాట్సాప్ నెంబర్ 9490617444 కు సమాచారం ఇవ్వాలి.
* పోలీసుల సహకారం తీసుకుంటూ చోరీలను నియంత్రించడంలో సహాయం చేయండి.