PROTECT: సైబర్ నేరాల నివారణ కోసం ప్రాజెక్ట్ ప్రొటెక్ట్ ప్రారంభం
- సైబర్ నేరాల నివారణ కోసం ప్రాజెక్ట్ ప్రొటెక్ట్
- ప్రొటెక్ట్ ప్రాజెక్ట్‌ను రూపొందించిన సైబరాబాద్ పోలీసులు
- ప్రారంభించిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ వినీత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PROTECT: సైబర్ నేరాల నివారణ కోసం సైబరాబాద్ పోలీసులు P.R.O.T.E.C.T పేరుతో సరికొత్త ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చారు. సైబరాబాద్ పోలీస్ రూపొందించిన P.R.O.T.E.C.T(ప్రొటెక్ట్) అనే ప్రాజెక్ట్‌ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ వినీత్‌లు లాంచనంగా ప్రారంభించారు. ఆన్లైన్ డిజిటల్ ప్రపంచంలో పౌరులకు అవగాహన కల్పించడం, ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ పని చేయనుంది.
2016 నుండి సైబర్ నేరాలను చూస్తున్నామని.. రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. నేరం జరిగిన తర్వాత నేరస్థులను పట్టుకోవడం కంటే అసలు నేరం జరగకుండా ప్రజలు జాగ్రత్త పడాలన్నారు. సైబర్ నేరాలను అరికట్టే బాధ్యత అందరిపై ఉందన్నారు. స్టూడెంట్స్, వాలంటీర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. సైబర్ క్రైమ్ గురించి అందరం కలిసి ప్రజల్లో అవగాహన తీసుకురావాలని వారికి సీపీ సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ముందుకు వచ్చిన వారికి సీపీ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులో భారీ విజయం.. వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం 3 నెలల పరిశోధన
- Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
- WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
Read Also: Deputy CM Bhatti Vikramarka: తప్పు చేశారా లేదా అని చెప్పాల్సింది కేటీఆర్ కాదు..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది దాదాపు 700 కోట్లు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి బాధితులు నగదు పోగొట్టుకున్నారని.. మనకు తెలియకుండానే సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. మన ప్రమేయం లేకుండానే బ్యాంక్‌లో మన డబ్బు మాయం అవుతుందని.. సాధారణ నేరాల కంటే సైబర్ నేరాలు డేంజర్ అంటూ సీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ప్రజలు పడుతున్నారని.. 1930 కి కాల్ చేస్తే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా పోలీసులు కాపాడతారన్నారు. సైబర్ నేరాలను అరికట్టడానికి టోల్ ఫ్రీ 1930 ఉందని ప్రజలకు తెలియజేయాలన్నారు. సోషల్ మీడియా ద్వారా సైబర్ క్రైమ్స్‌పై ప్రజలకు అవగాహన తీసుకురావాలన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రొటెక్ట్ పేరుతో త్వరలో మంచి రీసల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నామని సీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులో భారీ విజయం.. వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం 3 నెలల పరిశోధన
-
Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్‌కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!