Betting Racket: వాళ్లంతా బాగా చదువుకున్నారు.. ఒక్కొక్కరు ఇంజనీరింగ్లు పూర్తిచేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. మంచి MNC కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీళ్లకు డబ్బు ఆశ ఉంది. అది చివరికి వాళ్లను కటకటాల వెనక్కి నెట్టేసింది. ఈజీగా డబ్బు సంపాదించేందుకు బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేయడం మొదలు పెట్టారు కొంత మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. మంచి వాక్చాతుర్యం ఉన్న నలుగురు.. ఏకంగా టెలిగ్రామ్ యాప్‌లో ప్రత్యేకంగా గ్రూపులను తయారు చేసి ఆ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఒక్కొక్కరికి లక్షల కొద్ది వ్యూస్ వచ్చాయి. ప్రతి మ్యాచ్‌కి సంబంధించి బెట్టింగ్ పెట్టమని చెప్పేవారు. మ్యాచ్‌లో సదర్ టీంపై బెట్టింగ్ పెడితే గెలుస్తుందని చెప్పేవారు. అందుకు సంబంధించి తాము ఎంత పెట్టుబడి పెట్టామన్నది కూడా తెలిపేవారు.
Read Also:Golden Gang Arrest: దొంగలకే దొంగ.. గజ దొంగ.. గోల్డెన్ గ్యాంగ్ అరెస్ట్..!
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌పై నిషేధం ఉంది. అయినప్పటికీ కూడా వీళ్లు ఇతర దేశాల ఐపీ అడ్రస్‌లను వినియోగించి బెట్టింగ్ యాప్ లని ప్రమోషన్ చేశారు. ఇలా రెండు నెలల కాలంలో నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఏకంగా రెండు కోట్లకి పైగా సంపాదించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తూ కమీషన్లు ఆర్జిస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లను సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. చిన్నంశెట్టి నాగ రాకేశ్, పి.దీపక్, గుగులోత్ శ్రీరామ్ నాయక్, హేమంత్ కుమార్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 10 సెల్‌ఫోన్లు, 2 ల్యాప్‌టాప్స్, ఏటీఎం కార్డులు, బ్యాంకు బుక్ లను స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ సాయి శ్రీ తెలిపారు.
Read Also:Drugs Federals: డ్రగ్ పెడ్లర్ గేమ్ ఓవర్.. డ్రగ్స్ దందా ముఠా అరెస్ట్..!
టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్‌లో నిందితులు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నట్టు గుర్తించామన్నారు. నిందితులకు 10 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. బెట్టింగ్ వల్ల ఓ యువకుడు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. కమీషన్‌తో ఒక్కొక్కరు 50 లక్షలు సంపాదించినట్టు గుర్తించామన్నారు పోలీసులు. బెట్టింగ్లో తెలుగు ప్రజలే లక్ష్యంగా ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. 2019 నుంచి వీరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. 10 విదేశీ వెబ్‌సైట్లను నిందితులు ప్రమోట్ చేస్తున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నాని డీసీపీ తెలిపారు. 10 విదేశీ వెబ్ సైట్లను నిందితులు ప్రమోట్ చేస్తున్నారు. నిందితులు ఎవరికీ చిక్కకుండా తెలివిగా డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి మోసం చేస్తూ.. 13శాతం కమిషన్ తీసుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దందాతో 80 లక్షలు అక్రమంగా సంపాదించినట్టు తెలిపారు.