Telugu News

WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Agnipath Protests
  • Congress Satyagraha Deeksha
  • Covid 19
  • President Election
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Cyber Criminals Looting Money Of Whatsapp Payment Users With Whatsapp Qr Code

Whatsapp Scam: వాట్సప్‌లో సరికొత్త స్కాం.. జాగ్రత్తపడండి ఇలా..

Published Date - 01:18 PM, Fri - 17 June 22
By Mahesh Jakki
Whatsapp Scam: వాట్సప్‌లో సరికొత్త స్కాం.. జాగ్రత్తపడండి ఇలా..

వాట్సప్… ప్రపంచానికి పరిచయం అక్కర్లేని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. ఒక్క భారతదేశంలోనే దాదాపు 40 కోట్లకు పైగా వాట్సప్ యూజర్లు ఉన్నారు. వాట్సప్ వినియోగదారులను దోచుకునేందుకు కొత్తకొత్త స్కాంలు బయటపడుతున్నాయి. తాజాగా మరో స్కామ్ కలకలం రేపుతోంది. ఈ స్కామ్‌తో యూజర్ల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరస్థులు. ఆ స్కామ్ ఎలా జరుగుతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి మరీ.

భారత్‌లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ ఎంత పాపులర్ అయిందో వాట్సప్ కూడా అంతే పాపులర్ అయింది. కొన్నాళ్ల క్రితం వాట్సప్ పేమెంట్స్ పేరుతో వాట్సప్‌లో కూడా యూపీఐ సేవలు ప్రారంభం అయ్యాయి. దీన్ని అవకాశంగా తీసుకొని మోసగాళ్లు వాట్సప్ యూజర్లను దోచేస్తున్నారు. ఇందుకోసం క్యూఆర్ కోడ్ పేమెంట్ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఆ కోడ్‌ పంపించి వాట్సప్ యూజర్ల ఖాతా ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా మోసాలను వాట్సప్ క్యూఆర్ కోడ్ స్కామ్ అని పిలుస్తున్నారు. అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతుంది? మీరు మోసపోకుండా ఏం చేయాలి? తెలుసుకోండి.

ఇంటర్నెట్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే ప్లాట్‌ఫాంలో ప్రొడక్ట్స్‌ని పోస్ట్ చేసేవారిని సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. మీరు పోస్ట్ చేసిన ప్రొడక్ట్ తమకు నచ్చిందని, తాము కొంటామని మాటలు కలుపుతారు. బేరం కుదుర్చుకుంటారు. వాట్సప్ ద్వారా పేమెంట్ చేస్తామని నమ్మిస్తారు. మోసగాళ్లు తమ క్యూఆర్ కోడ్‌ని షేర్ చేసి, ఆ కోడ్ స్కాన్ చేస్తే అడ్వాన్స్ పేమెంట్ వస్తుందని నమ్మిస్తారు. యూజర్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే పిన్ ఎంటర్ చేయమని మెసేజ్ కనిపిస్తుంది. పిన్ ఎంటర్ చేయగానే డబ్బులు అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి. డబ్బులు స్వీకరించడానికి యూజర్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. తమ క్యూఆర్ కోడ్ షేర్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మోసపోతుంటారు. ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువవుతున్నాయి.

మీరు ఎవరికైనా డబ్బులు పంపాలనుకుంటే వారి క్యూఆర్ కోడ్ తీసుకోవాలి. ఒకవేళ మీరు డబ్బులు పొందాలనుకుంటే మీ క్యూఆర్ కోడ్ షేర్ చేయాలి. అంతే తప్ప మీరు డబ్బులు స్వీకరించడానికి ఇతరులు పంపే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎవరి నుంచైనా డబ్బులు రావాల్సి ఉంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకూడదు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి క్యూఆర్ కోడ్ వస్తే పట్టించుకోకూడదు. ఆ క్యూఆర్ కోడ్ అస్సలు స్కాన్ చేయకూడదు. మీరు ఎప్పుడైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లించాల్సి ఉంటే అమౌంట్ కరెక్ట్‌గా ఎంటర్ చేయాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మీ అకౌంట్ ఖాళీ కావడం ఖాయం. ఒకవేళ మీరు మోసపోయినట్టైతే సైబర్ క్రైం వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయొచ్చు.

  • Tags
  • Crime News
  • cyber crime
  • cyber criminals looting money
  • qr code
  • WhatsApp

RELATED ARTICLES

ITC Kohinoor Pub : పబ్‌లో రాత్రి ఏం జరిగిందో బయటపెట్టిన విష్ణు..

Breaking News : మారని మృగాళ్లు.. 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌ రేప్‌..

Crime News: ఇంట్లో శవంగా మహిళ.. పెంచుకున్న పిల్లులే పీక్కుతిన్నాయి

Corpse Found : సగం కాలిన మహిళ శవం లభ్యం..

Cyber Crime: ఒక టీ-షర్ట్ కొన్న పాపానికి రూ. 3 లక్షలు హాంఫట్

తాజావార్తలు

  • Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికలు.. అభ్యర్థి ఎంపికలో బీజేపీ వ్యూహం అదేనా..?

  • Viral News: వామ్మో.. కిలో టీ పొడి ధర అక్షరాలా రూ.లక్ష

  • Vijaya Kanth: కెప్టెన్ విజయకాంత్ ఆరోగ్యం విషమం.. ట్వీట్ చేసిన రజినీకాంత్

  • Andhra Pradesh: విద్యార్థులకు అలర్ట్.. రేపు ఇంటర్ ఫలితాలు విడుదల

  • Elon Musk: అమ్మాయిగా మారిన ఎలన్ మస్క్ కుమారుడు.. పేరు మార్పు కోసం దరఖాస్తు

ట్రెండింగ్‌

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

  • Viral News : ఇలాంటి వారుకూడా ఉంటారు మరీ.. ఇది చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions