ఈజీమనీకి అలవాటుపడిన సైబర్ కేటుగాళ్లు ఎవరినీ వదలడం లేదు. అనంతపురం జిల్లాలో సైబర్ మోసగాళ్ళు మాయచేసి యువకుడి ఖాతా నుంచి నగదు మాయం చేశారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి.ఎక్కడ చూసినా సైబర్ నేరగాళ్లు చేతివాటం చూపిస్తున్నారు.ఏ చిన్న అవకాశం ఉన్న సరే దోపిడీకి పాల్పడుతున్నారు.చదువుకున్న వాళ్ళు చదువురాని వాళ్ళు అన్న తేడా లేకుండా అడ్డుగోడలుగా దోచేసుకుంటున్నారు.ఇక సైబర్ నేరాల బారిన పడుతున్న వారిలో పెద్దపెద్ద ఉద్యోగస్తులు పాటు నిరుద్యోగులు కూడా ఉన్నారు.
ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తి పట్టణం జెండా వీధికి చెందిన మొహమ్మద్ సిరాజుద్దీన్ అనే యువకుడు బ్యాంక్ అకౌంట్ లో మంగళవారం నగదు మాయమైంది. నగదు డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో పరిశీలించిన యువకుడు బ్యాంక్ అధికారులకు సంప్రదించాడు.
Read Also:Viral Video: ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో దురుసు ప్రవర్తన.. కంటతడి పెట్టిన పోలీస్.. వీడియో వైరల్
సైబర్ క్రైమ్ నేరగాళ్లు నగదు మాయం చేసినట్లు బ్యాంక్ అధికారులు బాధితుడికి తెలిపారు. బ్యాంకు ఖాతా బుక్ తో ఫిర్యాదు చేసే కంప్లైంట్ రైజ్ చేస్తామని బ్యాంక్ మేనేజర్ బాధితుడికి తెలిపారు. ఆన్లైన్ యాప్ లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు ఖాతాదారులకు అధికారులు సూచించారు. అపరచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వివిధ యాప్ లనుంచి వచ్చే మెసేజ్ లు నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. డిజిటల్ మని ట్రాన్స్ ఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఏ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయవద్దంటున్నారు.
Read Also: Viral Video: ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో దురుసు ప్రవర్తన.. కంటతడి పెట్టిన పోలీస్.. వీడియో వైరల్