Rajasthan Traffic Cop Alleges Abuse By Men, Video Goes Viral: రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నప్పుడు కొంత మంది వ్యక్తులు తనతో అనుచితంగా ప్రవర్తించారని ట్రాఫిక్ కానిస్టేబుల్ కన్నీరు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియో ఆధారంగా రాజస్థాన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని అధికారులు మంగళవారం వెల్లడించారు. రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు వ్యక్తులు తనను వేధించారన ట్రాఫిక్ కానిస్టేబుల్ వీడియో రోధిస్తూ తెలిపారు. ఆ వ్యక్తులు మంత్రి ఇంటికి రమ్మని అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ తెలిపారు. ఆ వీడియో క్లిప్‌లో ఆ పోలీస్ అధికారి ఎవరి పేరును పేర్కొనలేదు.
ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో బికనీర్ రేంజ్ ఐజీ ఓం ప్రకాష్ ఈ విషయంపై దర్యాప్తు చేయాల్సిందిగా చురు ఎస్పీ రాజేష్ కుమార్ మీనాను ఆదేశించారు. సోమవారం కానిస్టేబుల్ ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కొందరు వ్యక్తులు అతనితో అనుచితంగా ప్రవర్తించారని చురు సీఐ రాజేంద్ర బుర్దక్ ఆరోపించారు. మంగళవారం కానిస్టేబుల్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
Read Also: RMP Doctor: ఆర్ఎంపీని అన్నాడు.. అందినకాడికి దోచుకున్నాడు
ఇదిలా ఉండగా.. రాజస్థాన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన రాజేంద్ర రాథోడ్ చురులో పోలీసులను బెదిరించారని , రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా ఓ వీడియోను పంచుకున్నారు. రాజేంద్ర రాథోడ్ చురు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంతలో, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా వీడియోను పంచుకున్నారు మరియు రాజస్థాన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్ చురులో పోలీసులను బెదిరించారని ఆరోపించారు. “రాజేంద్ర రాథోడ్ సాహబ్, మీరు చురు ప్రజలను, పోలీసులను బెదిరించి ఎన్నికలలో గెలుస్తారా? చట్టాన్ని కాపాడేవారిని హింసించి మీరు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?” అని దోతస్రా హిందీలో ట్వీట్ చేశారు.
इसीलिए कल राजस्थान पुलिस को बधाई दे रहे थे क्या ? चूरू police को मंत्री जी ने अपना गुलाम समझ रखा है क्या आज पुलिस प्रशासन रो रहा है @RajCMO@DmChuru @PoliceRajasthan @ChuruPolice @RajPoliceHelp @8PMnoCM @rpbreakingnews @zeerajasthan_ @Rajsthanikaka pic.twitter.com/Zi0CcDQjwF
— Ajay Choudhary (ढाणां) (@a_jay_choudhary) April 17, 2023