మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాప తీర్మానం చేసింది. ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సభ్యులు సమావేశమై సంతాప తీర్మానం చేశారు.
ఢిల్లీలో శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.