Currency Notes: దేశవ్యాప్తంగా నోట్ల రద్దు తర్వాత 500, 1000 రూపాయల నోట్లకు సంబంధించి అనేక రకాల ఫేక్ వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఎవరి దగ్గరైనా పాత 500, 1000 రూపాయల నోట్లు ఉంటే బ్యాంకుల్లో మార్చుకోవచ్చని RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తెలిపినట్లు సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేస్తుంది. పుకారు వార్తలపై రిజర్వు బ్యాంక్ స్పందించింది.
Read Also: Pakistan Crisis: పాకిస్తాన్‌పై మరో పిడుగు.. 2026 కల్లా రూ.63 వేల కోట్లు కట్టకపోతే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నుండి వచ్చిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేఖలో పాత 500, 1000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చని ఉంది. భారతీయ నోట్ల రద్దు చేసిన కరెన్సీ నోట్లను మార్చుకునే అవకాశాన్ని విదేశీ పౌరులకు ఆర్‌బిఐ మరింత పొడిగించినట్లు వైరల్ అయిన లేఖలో పేర్కొన్నారు.
Read Also: Kidnap Drama : నీ మొగుడిని వదిలి నాతో రా.. లేదంటే..
ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతుండడంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB ఫాక్ట్ చెక్) బృందం ఈ విషయాన్ని విచారించింది. దానిపై అసలు నిజాలను వెలుగులోకి తెచ్చింది. 500-1000 పాత నోట్లను విదేశీ పౌరులకు మార్చుకునే సదుపాయాన్ని పొడిగించాలనే వాదన నకిలీదని పీఐబీ పేర్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్లెయిమ్ గురించి ట్వీట్ చేస్తూ, విదేశీయులకు భారతీయ కరెన్సీ నోట్లను మార్చుకునే సదుపాయం 2017లో ముగిసిందని.. 500, 1000 నోట్ల మార్పిడికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపింది.