Crocodile Mummy: 3000 ఏళ్లనాటి మొసలి మమ్మీ.. సీటీ స్కాన్ లో సంచలన విషయాలు!
- ఈజిప్ట్ పిరమిడ్లు.. మమ్మీలకు ప్రసిద్ధి
- వాటి వెనుక చాలా కథలు
- మతపరమైన ఆచారాల ప్రకారం కొన్ని జంతువులను కూడా బలి ఇచ్చారని అధ్యయనం వెల్లడి
- ఇటీవల ఓ మమ్మీ మొసలిని గుర్తించిన శాస్త్రవేత్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈజిప్ట్ పిరమిడ్లు.. మమ్మీలకు ప్రసిద్ధి చెందింది. అయితే వాటి వెనుక చాలా కథలు ఉన్నాయి. మతపరమైన ఆచారాల ప్రకారం కొన్ని జంతువులను కూడా బలి ఇచ్చారని ఓ అధ్యయనం గుర్తించింది. ఇటీవల ఓ మమ్మీ మొసలిని గుర్తించిన శాస్త్రవేత్తలు దానికి బర్మింగ్‌హామ్ మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీలో భద్రపరిచారు. ఆర్కియాలజీ అండ్ కల్చరల్ హెరిటేజ్ డిజిటల్ అప్లికేషన్స్ అనే జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనంలో భాగంగా మొసలిని స్కాన్ చేశారు శాస్త్రవేత్తలు. పొట్టలో జీర్ణం కాని చేప, చేప హుక్ ను కనుగొన్నారు. దీన్ని వేటాడి పట్టుకొచ్చిన వెంటనే బలి ఇచ్చినట్లు నిర్ధారించారు.
READ MORE: CM Chandrababu: రేపు సోమశిల జలాశయాన్ని పరిశీలించనున్న సీఎం చంద్రబాబు
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ఈజిప్టులోని పురాతన మనుషులనే కాకుండా.. వేలాది జంతువులను కూడా మమ్మిలాగా మార్చేవారు. ఈ తరుణంలో ఇటీవల కనుగొన్న మూడు వేల ఏళ్ల నాటి మొసలి మమ్మీపై మరోసారి పరిశోధనలు చేశారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు మొసలి ఎలా చనిపోయిందో కనుగొనేందుకు యత్నించారు. మమ్మీ చేయబడే ముందు మొసలికి ఏమి తినిపించారు? అంటే దాని కడుపులో ఇంకా ఆహారం మిగిలి ఉందా? ఎలా చంపారు? అనే పలు ప్రశ్నలు శాస్త్రవేత్తలను తలెత్తాయి. దీంతో మొసలిని రాయల్ మాంచెస్టర్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. పలు పరికరాలు వాడి దాదాపు 3000 సంవత్సరాలున్న ముసలి మమ్మీని బయటకు తీశారు. సీటీ స్కాన్ నిర్వహించారు. దీంతో సంచలన విషయాలు వెలువడ్డాయి. ఈ మొసలి కడుపులో గ్యాస్ట్రోలిత్‌లు కనిపించాయి. గ్యాస్ట్రోలిత్‌లు అంటే అలిమెంటరీ కెనాల్లో కనిపించే చిన్న రాళ్లు.
READ MORE:Arshad Warsi: కల్కిలో ప్రభాస్ ఒక జోకర్లా ఉన్నాడు.. ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్
చాలా సార్లు మొసళ్ళు చిన్న రాళ్లను మింగేస్తాయి. దీంతో మొసలిని మమ్మీ చేసిన వ్యక్తులు దాని అంతర్గత అవయవాలను బయటకు తీయలేదని నిర్ధారించింది. పొట్ట లోపల మెటల్ ఫిషింగ్ హుక్, చేపలు కళేబరాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో ఒక చేపను హుక్ చేసి నదిలో పడేసి మొసలిని పట్టుకునేవారు. మొసలి ఈ చేపను తినేందుకు వచ్చినప్పుడు వలలో చిక్కుకుపోయేది. ఈ కథ గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ యొక్క పత్రాలలో కనుగొనబడింది. క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో హెరోడోటస్ ఈజిప్ట్‌కు వెళ్లి ఇలాంటి చాలా కథలు రాసినట్లు సమాచారం.
READ MORE:Kolkata Doctor Case: “ఎందుకీ ద్వంద్వ వైఖరి”.. సీఎం మమతా బెనర్జీపై ట్రైనీ డాక్టర్ తండ్రి ఆగ్రహం..
ప్రస్తుతం, ఈజిప్టులో కనిపించని కొన్ని జంతువుల మమ్మీలు కూడా ఉన్నాయి. ఐబీస్ అనే ఓ అది పొడవాటి కాళ్లు, వంగిన ముక్కుతో వేటాడే పక్షి కూడా ఉంది. ఇది టోత్ అనే దేవునికి సమర్పించబడిందని కథలు చెబుతున్నాయి. దీంతో పాటు ఇక్కడ చాలా మొసళ్ల మమ్మీలు కనుగొనబడ్డాయి. ఇందులో ఇప్పుడు పరీక్షించిన మొసలి పెద్దది. ఇదే అతి పెద్దది. ఈజిప్టులోని ప్రజలు కూడా మొసలి చర్మాన్ని ధరించేవారని సమాచారం.
తాజావార్తలు
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!