CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
- 18 ఏళ్ల అనుబంధానికి స్టీఫెన్ ఫ్లెమింగ్ ముగింపు
- సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు పేర్లు
- చెన్నై యాజమాన్యం ఎవరిని ఎంపిక చేస్తుందో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK Head Coach Race For IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన కోచ్‌లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్టీఫెన్ ఫ్లెమింగ్.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో తన 18 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్లో సీఎస్కే తరఫున ఆటగాడిగా బరిలోకి దిగిన ఫ్లెమింగ్.. 2009 నుంచి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి ఫ్రాంచైజీని విజయాల బాటలో నడిపించాడు. ఫ్లెమింగ్ మార్గదర్శకత్వంలో సీఎస్కే ఐదు ఐపీఎల్ టైటిళ్లు, రెండు చాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలను గెలుచుకుంది. అంతేకాదు 10 ఐపీఎల్ ఫైనల్స్, 12 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరి లీగ్‌లో అత్యంత స్థిరమైన జట్టుగా నిలిచింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు సీఎస్కే విజయాల వెనుక ప్రధాన శక్తిగా ఫ్లెమింగ్ నిలిచాడు.
స్వయంగా తప్పుకున్న ఫ్లెమింగ్:
అయితే గత మూడు సీజన్లుగా సీఎస్కే ఆశించిన స్థాయిలో రాణించలేదు. 2023లో టైటిల్ గెలిచిన తర్వాత 2024లో ఐదో స్థానం, 2025లో పదో స్థానం, 2026లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ జట్టు నుంచి స్వయంగా తప్పుకున్నాడు. పరస్పర అంగీకారంతోనే వైదొలిగినట్లు ఫ్లెమింగ్ సహా చెన్నై యాజమాన్యం కూడా తెలిపింది. ఫ్లెమింగ్ వైదొలగడంతో ఇప్పుడు అతడి స్థానాన్ని భర్తీ చేసే కోచ్ ఎవరు అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అందులో ఇద్దరు భారత దిగ్గజాల పేర్లు ఉన్నాయి.
Also Read
- Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!
- Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
- Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
- IND vs ENG 1st ODI: నేడు భారత్, ఇంగ్లండ్ మొదటి వన్డే.. మ్యాచ్ టైమింగ్స్‌లో మార్పు, లైవ్ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!
రాహుల్ ద్రవిడ్:
టీమిండియాకు 2024 టీ20 ప్రపంచ కప్‌ను అందించిన మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సీఎస్కేకు ప్రధాన ఎంపికగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఏ జట్టుకూ కోచ్‌గా వ్యవహరించని ద్రవిడ్‌కు ఎంతో అనుభవం ఉంది. 2018లో భారత అండర్-19 జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టిన ఆయన.. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు కూడా కోచ్‌గా పనిచేశాడు. ద్రవిడ్ ప్రశాంత స్వభావం, యువ ఆటగాళ్లను తీర్చిదిద్దే నైపుణ్యం సీఎస్కే సంస్కృతికి బాగా సరిపోతాయని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. మంచి అవకాశం వస్తే మళ్లీ కోచింగ్ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ద్రవిడ్ ఇటీవలే వెల్లడించాడు.
మార్క్ బౌచర్:
దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ మార్క్ బౌచర్ కూడా సీఎస్కే పరిశీలనలో ఉన్న మరో బలమైన అభ్యర్థి. 2019 నుంచి 2022 వరకు దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేసిన బౌచర్.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌కు కూడా కోచ్‌గా సేవలందించాడు. అతని నాయకత్వంలో ముంబై 2023 సీజన్లో ప్లేఆఫ్స్‌కు చేరింది. అంతకుముందు దక్షిణాఫ్రికా దేశవాళీ జట్టు ‘టైటాన్స్’ను నడిపించిన అనుభవం కూడా బౌచర్‌కు ఉంది. అంతర్జాతీయ, ఫ్రాంచైజీ క్రికెట్లో అతని అనుభవం సీఎస్కేకు ఉపయోగపడే అవకాశం ఉంది.
ఎంఎస్ ధోనీ:
చెన్నై అభిమానులు ఎక్కువగా కోరుకునే పేరు ఎంఎస్ ధోనీ. ప్రస్తుతం అధికారికంగా ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించకపోయినా.. 2026 సీజన్లో కాలి కండరాల గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇటీవలే 45 ఏళ్లు పూర్తి చేసుకున్న ధోనీ.. త్వరలో ఆటకు వీడ్కోలు పలికే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే సీఎస్కే హెడ్ కోచ్‌గా ధోనీ బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జట్టుతో అతనికి ఉన్న అనుబంధం, ఆటగాళ్లపై ప్రభావం, వ్యూహాత్మక ఆలోచనలు సీఎస్కేను మళ్లీ విజయాల బాటలో నడిపించగలవు.
సీఎస్కే ముందు పెద్ద సవాలు:
స్టీఫెన్ ఫ్లెమింగ్ వంటి దిగ్గజ కోచ్ స్థానాన్ని భర్తీ చేయడం అంత తేలికైన విషయం కాదు. కొత్త కోచ్ జట్టును మళ్లీ టైటిల్ పోరులో నిలబెట్టడమే కాకుండా.. ఆధునిక టీ20 క్రికెట్‌కు తగ్గట్టుగా సీఎస్కే ఆటతీరును మార్చాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కోచ్ రేసులో ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్, మార్క్ బౌచర్, ఎంఎస్ ధోనీ పేర్లు బలంగా వినిపిస్తున్నా.. చివరికి చెన్నై యాజమాన్యం ఎవరిని ఎంపిక చేస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
-
UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!