CSK IPL 2026: ఐపీఎల్ 2026కు ముందు సీఎస్కేకు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఈ సీజన్ మొత్తానికి దూరం
- ఐపీఎల్ 2026కు ముందు సీఎస్కేకు భారీ ఎదురుదెబ్బ
- స్టార్ ప్లేయర్ ఈ సీజన్ మొత్తానికి దూరం
- నాథన్ ఎల్లిస్ గాయం కారణంగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. ఐపీఎల్ 2026కు ముందు సీఎస్కేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బౌలర్ మొత్తం సీజన్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్ 2026లో, రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తమ ఆరో టైటిల్‌ను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ లక్ష్యం సీఎస్ కేకు మరింత కష్టతరం కావచ్చు. చెన్నై ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
Also Read:Telangana: ఐదుగురిని ప్రభుత్వ విప్‌లుగా నియమించిన తెలంగాణ ప్రభుత్వం..
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ఎల్లిస్ లేకపోవడం సీఎస్కేకు పెద్ద దెబ్బ. చెన్నై తరఫున చివరి ఓవర్లలో ఎల్లిస్ బాగా బౌలింగ్ చేస్తాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసిన అనుభవం కూడా ఉంది. గతంలో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. ఐపీఎల్ 2025 వేలంలో సీఎస్కే అతన్ని కొనుగోలు చేసింది. ఈ ఆస్ట్రేలియన్ బౌలర్ ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లలో ఆడటం లేదు. అతని స్థానంలో సీఎస్కే ఇంకా ఎవరినీ ప్రకటించలేదు.
నాథన్ ఎల్లిస్ ఐపీఎల్ 2026 నుండి తప్పుకున్నాడు
ఐపీఎల్ 2026కు ముందు సీఎస్కే మతిషా పతిరానాను విడుదల చేసింది. ఆ తర్వాత వేలంలో ఎల్లిస్‌ను తమ జట్టులోకి తీసుకున్నారు. సీఎస్కే ఫాస్ట్ బౌలింగ్‌కు నాయకత్వం వహించాల్సి ఉన్న ఎల్లిస్, గాయం కారణంగా టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యాడు. 2025లో సీఎస్కే అతడిని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. అతను గతంలో 2021 నుండి 2025 వరకు పంజాబ్ తరఫున ఆడాడు. తన ఐపీఎల్ కెరీర్లో 17 మ్యాచ్‌లు ఆడి, 19 వికెట్లు పడగొట్టాడు.
Also Read:iPhone 17e.. చౌకగా అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్.. పనితీరు ఎలా ఉందంటే..?
ఎల్లిస్ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. స్పోర్ట్‌స్టార్‌తో మాట్లాడుతూ, సీఎస్కే సీఈఓ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ఎల్లిస్ లేకపోవడం మాకు పెద్ద దెబ్బ. అతను డెత్ ఓవర్లలో కీలక బౌలర్. మేము అతని స్థానంలో మరొకరి కోసం చూస్తున్నాము అని తెలిపారు. చెన్నై ఫాస్ట్ బౌలింగ్ దళాన్ని పరిశీలిస్తే, వారి విదేశీ బౌలర్లలో మాట్ హెన్రీ, జాక్ ఫౌల్క్స్ ఉన్నారు. ఇంగ్లాండ్ ఆల్-రౌండర్ జేమీ ఓవర్టన్ కూడా చెన్నై జట్టులో భాగమే. భారత పేసర్లలో ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్ ఉన్నారు. వారి ఫాస్ట్ బౌలింగ్ దళం బలంగా కనిపిస్తున్నప్పటికీ, ఎల్లిస్ నిష్క్రమణ ఒక పెద్ద దెబ్బ. చెన్నై తమ తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.
తాజావార్తలు
-
CM Vijay Removes White Towel: బ్రిటిష్ విఐపి సంస్కృతికి చెక్ పెట్టిన సీఎం విజయ్.. కుర్చీ నుంచి వైట్ టవల్ తొలగింపు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్‌తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..