NTV Telugu Site icon

GT vs CSK : గుజరాత్‌ టైటాన్స్‌ లక్ష్యం 179.. రుతురాజ్ సెంచరీ మిస్‌

Csk Vs Gt

Csk Vs Gt

క్రికెట్‌ ప్రియులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నాలుగు సంవత్సరాల తర్వాత స్వదేశంలో జరుగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో ప్రారంభ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. అయితే.. గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకు హార్దిక్‌ పాండ్యా సారథ్యం వహిస్తుండగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు మహేంద్ర సింగ్‌ ధోనీ కెప్టెన్‌గా ఉన్నారు. అయితే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.

Also Read : Mohan Bhagwat: భారత్ నుంచి ఎందుకు విడిపోయామా అని పాకిస్తాన్ ప్రజలు బాధపడుతున్నారు.

టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ధోనీ సేన.. 14 ర‌న్స్ వ‌ద్ద తొలి వికెట్ చేజార్చుకుంది. డెవాన్ కాన్వే(1)ను ష‌మీ బౌల్డ్ చేశాడు. ఆ త‌ర్వాత సిక్స్‌లతో గుజ‌రాత్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు రుతురాజ్ గైక్వాడ్. అత‌డి జోరు చూస్తుంటే సెంచ‌రీ చేసేలా క‌నిపించాడు. కానీ, అల్జారీ జోసెఫ్ ఓవ‌ర్‌లో శుభ్‌మ‌న్ గిల్ అద్భుత క్యాచ్ ప‌ట్టడంతో వెనుదిరిగాడు. ఈ యంగ్‌స్ట‌ర్ 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌ల‌తో 92 ర‌న్స్ చేశాడు. మిగ‌తా బ్యాట‌ర్లు ధాటిగా ఆడ‌లేక‌పోయారు. బెన్ స్టోక్స్ (7), ర‌వీంద్ర జ‌డేజా(1) త‌క్కువ‌కే ఔట‌య్యారు. ఆఖ‌రి ఓవ‌ర్‌లో ధోనీ సిక్స్, ఫోర్ బాద‌డంతో సీఎస్కే 170 ప్ల‌స్ స్కోర్ చేసింది.

Also Read : Inspiring Video : మానవత్వం చాటిన ఎస్సై.. వర్షంలో సిబ్బందితో కలిసి

Show comments