వర్షంతో కల్లాలలో తడుస్తున్న మిర్చి పంటకు పట్టాలను కప్పి రక్షించారు ఓ ఎస్ఐ. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలంలో చోటుచేసుకుంది. శ్రీరామ నవమి సందర్భంగా మఠంపల్లి మండలం రఘునాథపాలెం లో ఎడ్ల పందాలను గ్రామస్తులు నిర్వహించుకున్నారు. ఆ కార్యక్రమానికి బందోబస్తుగా వెళ్ళిన ఎస్సై రవికుమార్, సిబ్బంది.. విధులు ముగించుకొని తిరిగి వెళుతున్నారు.
Also Read : Mahesh Babu: అన్నా.. ఇలా చేయడం నీకు కొంచమైనా న్యాయంగా అనిపిస్తుందా..?
అకస్మాత్తుగా వర్షం కురవడంతో కల్లాలో అప్పటికే ఆరబోసి ఉన్న మిర్చినీ కాపాడుకోవడానికి అక్కడ ఉన్న మహిళ అన్ని ప్రయత్నాలు చేస్తుండగా అటుగా వెళుతున్న ఎస్సై… తన సిబ్బందితో కలిసి కల్లాలలో ఉన్న మిరప పంటపై పట్టాలు కప్పడం… కళ్ళం చుట్టు పరిగెత్తుతూ మిర్చి పంట తడవకుండా ఎస్సై చేసిన ప్రయత్నాన్ని స్థానికులు సెల్ ఫోన్ లో బంధించారు.. తాజాగా ఈ వీడియో స్థానికంగా వైరల్ కాగా ఎస్సై చేసిన పనిని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.