Site icon NTV Telugu

CS Shanthi Kumari: జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్..

Shanti Kumari

Shanti Kumari

అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో యాసంగి పంట సాగుకు సరిపడ సాగు నీరు అందించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో.. యాసంగి సీజన్ పంట సాగు, రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. యాసంగి పంటలకు నీటి నిర్వహణ సమర్ధవంతంగా జరిగేలా కలెక్టర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి తెలిపారు. గతేడాదితో పోలిస్తే నికర సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ నీటి వనరులలో నీటి లభ్యత చాలా సౌకర్యంగా ఉందని.. యాసంగి సీజన్‌ను బాగా చూసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే పది రోజులలో విద్యుత్, నీటి సరఫరాను జాగ్రత్తగా సమన్వయం చేయాలని.. విద్యుత్ సరఫరాలో ప్రస్తుత పరిస్థితి సౌకర్యవంతంగా ఉందని సీఎస్ తెలిపారు.

Read Also: Arani Srinivasulu: జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయండి.. ఎమ్మెల్యే పిలుపు

జిల్లాలో స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు మండల స్థాయి బృందాలను ఏర్పాటు చేయాలని, క్షేత్ర స్థాయిలో సమర్ధవంతమైన నిర్వహణ ఉండే విధంగా జిల్లా కలెక్టర్లు పర్యేవేక్షించాలని కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి సూచించారు. రాష్ట్రంలో నీటి నిల్వలు, విద్యుత్ సరఫరా తగినంత పరిమాణంలో ఉన్నాయని రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లను సీనియర్‌ అధికారులు సందర్శించిన తర్వాతజజ భోజన, ఇతర మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారంలో సత్ఫలితాలపై సీఎస్‌ సంతోషం వ్యక్తం చేస్తూ.. జిల్లా కలెక్టర్లను అభినందించారు. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు ఉత్తమ పద్ధతులను ఎంచుకోవాలని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమయానుకూల కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను కోరారు.

Read Also: RCB Unbox Event 2025: ‘ఈ సాలా కప్ నమ్దే’.. ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ డేట్ లాక్

Exit mobile version