Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) శాంతి కుమారి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) రఘునందన్ రావులను విచారణకు పిలిచి వారి స్టేట్‌మెంట్లను నమోదు చేసింది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, సెక్షన్ 5(2) ప్రకారం, ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేదా డీజీపీ అనుమతితో పాటు, DOT…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, అనుభవజ్ఞులైన విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక పదవులు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.ఎస్. శ్రీనివాసరాజును ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. శ్రీనివాసరాజు ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందినవారు. గతంలో టీటీడీ జేఈవోగా విశిష్ట సేవలు అందించారు. ఇటీవల పదవీ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఎంసీఆర్…
సీఎస్ శాంతి కుమారికి కీలక బాధ్యత అప్పగించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) వైస్ ఛైర్మన్ గా శాంతి కుమారి పేరును ప్రభుత్వం ప్రకటించింది. సీఎస్ పదవి విరమణ తర్వాత.. ఆమె ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో యాసంగి పంట సాగుకు సరిపడ సాగు నీరు అందించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో.. యాసంగి సీజన్ పంట సాగు, రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలపై సీఎస్ సమీక్ష నిర్వహించారు.
సాగునీటి సదుపాయం లేకపోవడం, అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. పంట నష్టానికి ఎకరాకు రూ. 25,000 పరిహారం అందించాలని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా.. కనీస మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ. 500 బోనస్, రైతు భరోసా పెట్టుబడి మద్దతు మరియు రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని కోరింది. ఆపదలో ఉన్న…
TSPSC Chairman: ఇవాళ టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి ఛార్జ్ తీసుకోనున్నారు. నిన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన మహేందర్ రెడ్డి..చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సమక్షంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) బృందం అక్టోబర్ 3 నుంచి హైదరాబాద్‌లో పర్యటించనుంది.
తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియమితులయ్యారు. కాసేపట్లో దీనిపై కాసేపట్లో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది. అయితే.. ఇప్పటి వరకు సీఎస్‌గా వున్న సోమేశ్ కుమార్‌ను కేంద్రం తెలంగాణ నుంచి రిలీవ్ చేసి ఏపీ కేడర్‌కు అప్పగించడంతో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపిక అనివార్యమైంది.