crow steals gold chain: సాధారణంగా మనుషులు దొంగతనం చేసిన వార్తలు చదువుతుంటాం. కానీ ఇదో విచిత్రమైన, ప్రత్యేకమైన వార్త. ఎక్కడ జరిగిందంటే కేరళలోని త్రిస్సూర్‌లో వెలుగుచూసింది. అసలు ఏంటీ వార్త అంటే ఓ కాకి బంగారం చోరీ చేసింది. ఓ మహిళ తన బంగారు గొలుసును మెట్లపై పెట్టి పని చేసుకుంటుండగా, ఎక్కడి నుంచో వచ్చిన ఓ కాకి దానిని పట్టుకొని ఎగిరిపోయింది. ఎంత పని చేశావే కాకి అంటూ పాపం ఆ మహిళ దాని వెంట పడింది. మొత్తానికి ఆమె ఆ కాకి దగ్గరి నుంచి తన బంగారు గొలుసును తిరిగి సంపాదించుకుందా లేదా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ MORE: Kishkindhapuri : కిష్కిందపురి టీజర్ రిలీజ్.. భయపెట్టేస్తున్న బెల్లంకొండ..
త్రిస్సూర్‌లోని మథిలకంలో నివసిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్త షిర్లీ స్థానికంగా అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తున్నారు. ఈనెల 13న ఆమె అంగన్‌వాడీ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు తన మెడలోని రూ.3.5 లక్షల విలువైన బంగారు గొలుసు తీసి సమీపంలోని మెట్లపై ఉంచింది. గొలుసు దగ్గర ఒక ఆహార ప్యాకెట్ కూడా ఉంది. షిర్లీ తన పని చేసుకుంటుంటే ఎక్కడి నుంచో వచ్చిన ఒక కాకి అకస్మాత్తుగా ఆహార ప్యాకెట్‌ను వదిలిపెట్టి బంగారు గొలుసును తీసుకొని ఎగిరిపోయింది. కాకిని గమనించిన షిర్లీ అరుస్తూ దాని వెంట పరుగెత్తింది. షిర్లీని చూసి విషయం తెలుసుకున్న స్థానికులు కూడా కాకి వెంట పరుగెత్తడం ప్రారంభించారు. అక్కడ స్థానికంగా ఉన్న అడవులు, జలపాతాలతో నిండిన ప్రాంతంలోకి కాకి ఎగిరిపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కాకి అడవిలోకి వెళ్లకముందు సమీపంలోని చెట్టుపై కూర్చుంది. అప్పుడే వెనువెంటనే స్థానికులలో ఒకరు కాకిపై రాయి విసిరారు. ఈక్రమంలో బంగారు గొలుసును కాకి విడిచిపెట్టి గాల్లోకి ఎగిరిపోయింది.
తరువాత షిర్లీకి స్థానిక ప్రజలు గొలుసును వెతకడంలో సాయం చేశారు. మొత్తానికి ఆమె తన బంగారు గొలుసును తిరిగి పొందిన తర్వాత ఊపిరి పీల్చుకుంది. దీంతో షిర్లీ బంగారాన్ని కాకి చోరీ చేసిన వార్తలో కథ సుఖాంతం అయ్యింది.
READ MORE: Minister Anagani: స్త్రీ శక్తి స్కీమ్ కారణంగా కొత్త పాస్ బుక్స్ రిలీజ్ వాయిదా పడింది..