మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న పూలల్లో కనకాంబరం కూడా ఒకటి.. వీటికి ఏడాది పొడవునా డిమాండ్ ఉండటంతో రైతులు ఎక్కువగా వీటిని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే మిగితా పూలతో పోలిస్తే ఈ పంటను వెయ్యడం కాస్త కష్టంతో కూడిన పనే కానీ లాభాలు మాత్రం ఎక్కువే.. అందుకే వీటిని పండిస్తున్నారు.. అయితే ఈ పంటను పండించడంలో కొన్ని మెలుకువలు పాటిస్తే అధిక లాభాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు..
ఉష్ణమండల, మోతాదు ఉష్ణ మండలములలో పెరుగుతుంది. కనకాంబరం పూల మొక్క ఇంటి లోపల పెంచవచ్చు. వసంత ఋతువులో పెంచ వచ్చును. కనకాంబరం మొక్క ఏడు నెలల్లో రావాలి. కనకాంబరం మొక్క 1 నుండి 3 అడుగుల పొడవు, 1 నుండి 2 అడుగుల వెడల్పు లో ఉంటుంది . కనకాంబరం పువ్వులు నారింజ , నేరేడు, ఎరుపు , పసుపు రంగులలో మనము చూడ వచ్చును. కనకాంబరం మొక్క ఏడు నెలల్లో రావాలి పూలు వచ్చే సమయం ఏప్రిల్ మే నుంచి అక్టోబర్ వరకు నాటుకోవచ్చు..
మామిడి, కొబ్బరి లాంటి తోటల్లో అంతర పంటగా కూడా సాగుచేయవచ్చు.కనకాంబరం బహువార్షిక పంట. ఇది 4-6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. పంట వేసిన మూడు నెలల తర్వాత మొక్కలకు పూలు పూస్తాయి.. పుష్పం పూర్తిగా తెరవడానికి దాదాపు 2 రోజులు పడుతుంది. తెల్లవారుజామున కోయడం జరుగుతుంది. స్పైక్ యొక్క పొడవుపై ఆధారపడి ఉంటుంది.. కనకాంబరం బహువార్షిక పంటైనా ఒక సంవత్సరం వరకు మాత్రమే అధిక దిగుబడులు వస్తాయి. వాణిజ్యపరంగా సాగు చేయాలనుకునే రైతు ప్రతి సంవత్సరం పొడవునా 1500-2000 కిలోల పూల దిగుబడిని పొందవచ్చు. రైతు కౌలు దారుడు కాకుండా సొంత భూమి ఉన్నట్లయితే నికర ఆదాయం ఇంకా పెరుగుతుంది. పైన తెలిపిన వివరాల ప్రకారం కనకాంబరం సాగుపై రైతు పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడిపై మొదటి సంవత్సరం రూ. 2.90 పైసా ఆదాయం, అంటే ఖర్చు పోను రూ. 1.90 పైస లాభం వస్తుంది… మార్కెటింగ్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. అప్పుడే మరింత లాభాలను పొందవచ్చు..