Site icon NTV Telugu

BIG BREAKING : కాంగ్రెస్‌లో 12 మంది రాజీనామా.. మాణిక్కం ఠాగూర్‌కు లేఖలు

Congress Leaders

Congress Leaders

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీలు రగిల్చిన చిచ్చు పతాకస్థాయికి చేరకుంది. సీనియర్లలలో ఇప్పటికే చాలా మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిన్న హైదరాబాద్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సీనియర్లు సమావేశమై చర్చించారు. టీపీసీసీ మాజీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి, జగ్గారెడ్డి, కోదండరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి వంటి నేతలు హాజరై తాజా పరిస్థితులపై చర్చించారు. ఒరిజినల్‌ కాంగ్రెస్‌ నేతలకు అన్యాయం చేసిన వలస వచ్చినవారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను కాపాడుతున్న తమపై కోవర్టులంటూ సోషల్‌ మీడియాలో ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. అయితే.. తాజాగా గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం ప్రారంభమైంది.

Also Read : Canadian Billionaire Couple: వీడని దంపతుల డెత్ మిస్టరీ.. హంతకుడిపై 300 కోట్లు నజరానా
టీపీసీసీ రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమవేశానికి ఏఐసీసీ కార్యదర్శులు హాజరయ్యారు. అయితే అనూహ్యంగా.. పీసీసీ పదవులకు 12 మంది కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ నేతలు రాజీనామా చేశారు. వేం నరేందర్‌ రెడ్డి, సీతక్క, విజయరామారావు, చారగొండ వెంకటేష్‌, ఎర్రశేఖర్‌ సహా పలువురు నేతలు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌కు నేతలు పంపించారు. అయితే… ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. పదవి ఉన్నా లేకున్నా పని చేస్తాం. పదవుల కోసం రాలే, కాంగ్రెస్‌ సంక్షోభంలో ఉన్నప్పుడే పార్టీలోకి వచ్చామన్నారు.
Also Read : ఇలాంటి సమయంలో సెక్స్ చేయకూడదు.. లేకపోతే ప్రాణాలు పోతాయ్..!

Exit mobile version