చిత్తూరు జిల్లాలోని కొండమిట్టలో దారుణం చోటుచేసుకుంది. బ్యూటీపార్లలో పని చేస్తున్న యువతి ప్రశాంతిని దారుణంగా గొంతుకోసి చంపేశాడో యువకుడు. వేలూరు రోడ్డులోని ఆనందా ధియేటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అంతటితో ఆగకుండా ఆ యువతి ప్రశాంతిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు యువకుడు చక్రవర్తి. కొన ఊపిరితో ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మృతురాలు చిత్తూరు తాలూకా స్టేషన్ లోని కానిస్టేబుల్ నాగరాజు కుమార్తెగా గుర్తించారు.
Read Also: Allu Ramesh: యూట్యూబ్ ను షేక్ చేసిన ‘మా విడాకులు’ మామయ్య ఇక లేరు
ఓ బ్యూటీపార్లర్ లో రక్తపు మడుగులో యువతి, యువకులను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు,. యువతి దుర్గా ప్రశాంతి 28 సంఘటనా స్ధలంలోనే మృతిచెందింది. కొన ఊపిరితో ఉన్న యువకుడు చక్రవర్తిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో షాక్ కి గురయ్యారు మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడిని విచారిస్తే గానీ మరింత సమాచారం రాదంటున్నారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అక్కడి దృశ్యం హృదయ విదారకంగా, రక్తపు మరకలతో నిండి ఉంది.
Read Also: Sri Lanka vs Ireland: శ్రీలంక అతి భారీ విజయం.. గత రికార్డ్ బద్దలు