2026 T20 World Cup: 2026 T20 ప్రపంచ కప్‌కు ముందు క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. పాకిస్థాన్ ప్రభుత్వం తమ జట్టు టోర్నమెంట్లో పాల్గొంటుందని, కానీ ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో జరిగే గ్రూప్ దశ మ్యాచ్ ఆడదని ప్రకటించింది. రాజకీయ, ఇటీవలి పరిణామాల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2026 T20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారతదేశం – శ్రీలంక కలిసి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే పాకిస్థాన్ జట్టు తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడుతుంది.
READ ALSO: Bihar: ప్రియుడు ఉండగా మరొకరితో పెళ్లికి రెడీ.. సీన్ కట్ చేస్తే ఎంత ఘోరానికి ఒడిగట్టిందంటే..!
షాకింగ్ నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్..
పాకిస్థాన్ క్రికెట్ జట్టు శ్రీలంకకు వెళ్లడానికి పాక్ ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. అక్కడ వారి గ్రూప్ A మ్యాచ్‌లన్నీ కూడా షెడ్యూల్ అయ్యాయి. రాజకీయ కారణాల వల్ల పాకిస్థాన్ భారతదేశంలో ఆడటానికి నిరాకరించడంతో, భారతదేశం-పాకిస్థాన్ మ్యాచ్‌లను ICC తటస్థ వేదికలకు మార్చింది. రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు కొలంబోలో జరగాల్సి ఉంది. తాజాగా పాకిస్థాన్ ఈ మెగా టోర్నీలో భారత్‌లో తలపడటానికి ససేమీరా అంటూ తేగేసి చెప్పింది. ఈ మ్యాచ్‌ను బహిష్కరించి, టోర్నమెంట్ నుంచి పూర్తిగా తొలగించబడకుండా ఉండేలా ప్లాన్ చేస్తుంది. వాస్తవానికి గతంలో పాకిస్థాన్ కూడా బంగ్లాదేశ్‌లా టోర్నమెంట్ నుంచి వైదొలుగుతామని బెదిరించింది.
తాజాగా పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గ్రూప్ దశలో రెండు పాయింట్లు కోల్పోతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ పాక్ ఆడకపోతే ఓటమిగా పరిగణిస్తారు. దీంతో భారత్ ఆడకుండానే రెండు పాయింట్లు అందుకుంటుంది. కానీ ఇది ICCకి గణనీయమైన ఆర్థిక నష్టంగా మారవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే భారతదేశం-పాకిస్థాన్ మ్యాచ్ ప్రపంచ కప్‌లో అత్యధికంగా వీక్షించే, ఆదాయాన్ని సంపాదించే మ్యాచ్. పాక్ నిర్ణయంతో ICC తో పాటు పాకిస్థాన్ కూడా గణనీయమైన నష్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పుకున్న తర్వాత పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో భద్రతా సమస్యల కారణంగా బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీలో పాల్గొనడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఐసిసి బంగ్లా జట్టును టోర్నీ నుంచి బహిష్కరించింది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా టోర్నమెంట్ నుంచి వైదొలగాలని పాకిస్తాన్ గతంలో చర్చించింది, కానీ చివరికి భారత్ మ్యాచ్‌ను వదులుకోవాలని నిర్ణయించిందని సమాచారం.
READ ALSO: Honey Movie Trailer:’హనీ’ తప్పకుండా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా: హీరో నవీన్ చంద్ర