సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని జైల్లో పెట్టాలి అన్న వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. సనాతన ధర్మాన్ని సమర్థించే వారెవరయినా, పవన్ కళ్యాణ్ తో సహా శిక్షించాలి,అరెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం క్రూరమైనదని.. అరాచకమైనదన్నారు. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు.. పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నారని ప్రశ్నించారు. సెక్యులరిజాన్ని నాశనం చేసే ఈ సనాతన ధర్మాన్ని అనుసరించే వారిని శిక్షించాలి, విమర్శించే వారిని కాదన్నారు. తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో ఈ వ్యాఖ్యలు చేశారు.
READ MORE: AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వీటికి గ్రీన్ సిగ్నల్
