సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని జైల్లో పెట్టాలనడం హాస్యాస్పదమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సనాతన ధర్మాన్ని సమర్థించే వారెవరయినా, పవన్ కళ్యాణ్ తో సహా శిక్షించాలి,అరెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం క్రూరమైనదని.. అరాచకమైనదన్నారు. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు.. పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నారని ప్రశ్నించారు.