బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్ని మతాలను దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. దేశంలో చాలా తక్కువ శాతం ఉన్న మతాల పరిస్థితి ఉందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం భయందోళనలో ఉందని ఆరోపించారు. బీజేపీ కసాయి వారిలాగా ప్రవర్తిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. చెప్పి మరీ చంపేస్తున్నారని అన్నారు. రూరల్ నుంచి అర్బన్ కి వచ్చారు.. అర్బన్ నక్సల్స్ అంటున్నారని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.
Read Also: Posani Case : పోసాని కృష్ణ మురళి కేస్ అప్‌డేట్
మనం ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం.. మోడీ సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పునర్విభజన ద్వారా ఎక్కడ పెరుగుతుంది.. తగ్గుతుంది అనే లాభనష్టాలను బేరీజు వేసుకుని చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. దేశంలో ఫెడరలిజం లేకపోయినా పర్వాలేదు.. బీజేపీ అధికారంలో ఉండాలని ఆలోచిస్తోందని తెలిపారు. కాగా.. ఏప్రిల్ 25 నుంచి జాతీయ సమావేశాలకు వెళ్తున్నాం.. అందులో మరిన్ని విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీపీఐ నారాయణ తెలిపారు.
Read Also: MP Laxman: భారత్ ఎదుగుదలలో మహిళలే కీలకం కావాలి..
మరోవైపు.. డీలిమిటేషన్ పై నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కువమంది పిల్లలను కనమని పిలుపునివ్వడం రాజకీయ దివాలాకోరుతనమేనని అన్నారు. ఎక్కువమంది పిల్లలను కనడానికి మహిళలేమైనా ఉత్పత్తి పరిశ్రమలా అని ప్రశ్నించారు. వ్యవస్తీకృత హింసకు మహిళలే సమిధలని.. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.