NTV Telugu Site icon

CPI(M) : “అలయ్‌ బలయ్‌”పై సీపీఐలో భిన్నాభిప్రాయాలు.. సీపీఐ(ఎం) కీలక ప్రకటన

Tammineni Veerabhadram

Tammineni Veerabhadram

అలయ్ బలయ్‌పై సీపీఐలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాయి బాబా చనిపోవడానికి కారణం అయిన కేంద్రంలో మీరు భాగస్వామి.. అలయ్ బలయ్ కి రాలేనని నారాయణ ప్రకటించారు. మరోవైపు అలయ్ బలయ్ వేదిక పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా అభిప్రాయాలు పంచుకుని.. మానవత్వం చాటుకునే వేదిక కూనంనేని అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సీపీఐ(ఎం) కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.

READ MORE: Andhra Pradesh: అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లే!

“ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్‌, ఉద్యమకారుడు, జీఎన్‌ సాయిబాబ మృతికి సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా దేశద్రోహ నేరం మోపి 90శాతం అంగవైకల్యంతో ఉన్న సాయిబాబను మరో ఐదు గురితో కలిసి 2014 నుంచి టెర్రరిస్టు నెపంతో ఉపా చట్టం క్రింద దీర్ఘకాలం జైలులో నిర్బంధించింది. అర్బన్‌ నక్సలైట్‌గా ముద్రవేసింది. జైలులో వున్న సమయంలో ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా సరైన వైద్య సౌకర్యం అందించలేదు. పదేండ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం బాంబే హైకోర్టు నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు ఇవ్వడంతో మార్చి 5న విడుదలయ్యారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడారు. దళిత, గిరిజన, వికలాంగుల హక్కుల నేతగా, విద్యావేత్తగా పేరొందిన ఆయన మృతి ప్రజా ఉద్యమానికి తీరని లోటు.” అని తెలంగాణ సీపీఐ(ఎం) కమిటీ ప్రకటనలో పేర్కొంది.

READ MORE:Cpi : “అలయ్‌ బలయ్‌”పై సీపీఐలో భిన్నాభిప్రాయాలు.. వేదికపై కూనంనేని, రానన్న నారాయణ