అలయ్ బలయ్‌పై సీపీఐలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాయి బాబా చనిపోవడానికి కారణం అయిన కేంద్రంలో మీరు భాగస్వామి.. అలయ్ బలయ్ కి రాలేనని నారాయణ ప్రకటించారు.
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయిబాబా తుదిశ్వాస విడిచారు. ఉద్యమకారుడిగా, రచయితగా, విద్యావేత్తగా పేరు తెచ్చుకున్నారు. అయితే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.
మావోయిస్టు సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ శుక్రవారం జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.