CPI Sambasiva Rao Fires on Komatireddy Rajgopal Reddy
నల్లగొండ జిల్లా చండూరులో వామపక్షాల బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హజరయ్యారు. అయితే.. ఈ సందర్భంగా… సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. మునుగోడు కమ్యూనిస్టుల అడ్డా అని, 2018 లో కమ్యూనిస్టుల సహకారంతో రాజగోపాల్ రెడ్డి గెలిచాడని, ఆ విషయాన్ని రాజగోపాల్ రెడ్డి మరిచాడని ఆయన మండిపడ్డారు. నీతి నిజాయితీ గురించి రాజగోపాల్ రెడ్డి వద్ద నేర్చుకోవాల్సిన అవసరం కమ్యూనిస్టులకు లేదని, మేము ఎవరిని గెలిపించాలని అని అనుకుంటే వారే గెలుస్తారని ఆయన అన్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా పోటీ చేయాలో కమ్యూనిస్టులకు తెలుసు అని, పోత్తులేని రాజకీయ పార్టీలు భారతదేశంలో ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. ‘ఈ దేశంలో ప్రధాని అయ్యేంత శక్తివంతులు కమ్యూనిస్టులే.. బీజేపీ నేతలకు దేవుడు రాముడు ఒక్కడేనా.. మతాన్ని బట్టి మనుషుల రంగు ఉంటుందా… ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్న బిజెపికి ఎందుకు ఓటెయ్యాలి.. ప్రజా ద్రోహులు మాత్రమే కమ్యూనిస్టులను తిడతారు…. రోజుకు ఒక పార్టీ మారే వెధవలు కూడా మాపై విమర్శలు చేస్తున్నారు.. రాజగోపాల్ రెడ్డికి డబ్బులు ఉండొచ్చు…. కానీ మా వెంట ప్రజలు ఉన్నారు. సమాజాన్ని కాపాడుతున్నది కమ్యూనిస్టులే… మాతో కలిసి కర్ర పట్టుకునే దమ్ముందా, తుపాకీ పేల్చే దమ్ముందా బీజేపీకి. పదవుల కోసం పార్టీలు మారే నీచ సంస్కృతి కమ్యూనిస్టులది కాదు.. నమ్మిన సిద్ధాంతం సాధించాల్సిన లక్ష్యం కోసం ఒకే పార్టీలో కొనసాగుతాం…. మునుగొడులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలి.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిస్తే కమ్యూనిస్టులు గెలిచినట్లే… కమ్యూనిస్టు పార్టీలకు పొత్తులు కొత్త కాదు.. గెలిచిన తర్వాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రజల కోసం పనిచేయాలి.. ప్రజలను ఇబ్బంది పెట్టే పని చేస్తే కేసీఆర్ కూడా విడిచిపెడతాం… మళ్లీ కమ్యూనిస్టులకు మంచి రోజులు వస్తాయి…. కమ్యూనిస్టులు అందరూ ఐక్యం అయ్యే రోజు వస్తుంది… ఆనాడు ఎర్రకోట మీద ఎర్రజెండా ఎగరడం ఖాయం’ అని ఆయన వ్యాఖ్యానించారు.