Site icon NTV Telugu

CPI Ramakrishna: పాక్‌తోనే చర్చలు జరిపి యుద్ధం ఆపేశారు.. మావోయిస్టులు భారత పౌరులే అయినా చర్చలు చేయరా?

Cpi Ramakrishna

Cpi Ramakrishna

మావోయిస్టుల మృతదేహాలు అప్పగించడంలో కేంద్ర ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించకపోవడంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులు చర్చలకు వస్తామన్నా కేంద్రం తిరస్కరించి వెంటాడి చంపుతామనే పద్ధతి అనుసరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శత్రుదేశం పాకిస్థాన్‌తోనే చర్చలు జరిపి యుద్ధం ఆపేశారని, మావోయిస్టులు భారత పౌరులు అయినా చర్చలు చేయమంటారా? అని రామకృష్ణ ప్రశ్నించారు.

మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ మృతదేహంను కుటుంబ సబ్యులకు అప్పగించకపోవడంపై ప్రజా సంఘాల ఐక్యవేదిక నిరసన తెలిపింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సహా సీపీఎం, పౌర హక్కుల సంఘం, ప్రజాసంఘాల నేతలు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ… ‘మావోయిస్టుల మృతదేహాలు అప్పగించడంలో కేంద్ర ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టించింది. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని తెలుగు వారి మృతదేహాలు ఇప్పించాలని నిన్న లేఖ రాసాము. మృతదేహాలు అప్పగించకపోవడంపై సమగ్ర విచారణ జరిపించాలి. మావోయిస్టులు చర్చలకు వస్తామన్నా.. కేంద్రం తిరస్కరించి వెంటాడి చంపుతామనే పద్ధతి అనుసరించింది. ఇది నక్సలైట్లకు, కమ్యూనిస్టులకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు. శత్రుదేశం పాకిస్థాన్‌తోనే చర్చలు జరిపి యుద్ధం ఆపేశారు. మావోయిష్టులు భారత పౌరులు అయినా చర్చలు చేయమంటారా?’ అని ప్రశ్నించారు.

Also Read: TDP Mahanadu 2025: మరలా పెద్ద నోట్లు రద్దు చేయాలి.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు మృతదేహానికి ఛత్తీస్‌గఢ్ పోలీసులు దహన సంస్కారాలు నిర్వహించారు. శవాన్ని అప్పగించాలని నంబాల బంధువులు కోరినా.. పోలీసులు ససేమిరా అన్నారు. దాంతో నంబాల బంధువులు నిరాశతో ఇంటికి పయనం అయ్యారు. మృతదేహాన్ని అప్పగించలని వేడుకున్నా ఫలితం లేకపోయిందంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జీయన్నపేటలో విషాదచయలు అలుముకున్నాయి. చేసేసి లేక నంబాల కేశవరావు చిత్రపటానికి కుటుంబసభ్యులు నివాళి అర్పించారు.

Exit mobile version