ఏపీలో సీఎం జగన్ పై ఒకస్థాయిలో విరుచుకుపడుతున్నాయి విపక్షాలు. ఒక చేతకాని దద్దమ్మ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ . ప్రధాని మోదీని ఎందుకు పోలవరం పై నిలదీయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. 31 లక్షల మందికి ఇళ్లు ఇచ్చామని ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంటికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా స్తెంధవుడిలా అడ్డుపడుతున్నారు. అర్హుల్తెన లబ్ధిదారులకు వెంటనే ఇళ్లు కట్టించి ఇవ్వాలంటూ డిసెంబరు 5న విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
Read Also: goods train derailed: పట్టాలు తప్పి వెయిటింగ్ హాల్లోకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు.. ముగ్గురు మృతి
రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ప్రధాని మోడీ , సిఎం జగన్ వైఖరిని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి డబ్బులు డిమాండ్ చేస్తే అనేక పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయి. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోరు. లంచం డిమాండ్ చేసిన ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరిశ్రమలు రాకుండా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అభివృద్ధి నిరోధక పాలన ఏపిలో కొనసాగుతోంది.రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్రంలో సమస్యలప్తె అన్ని పార్టీలతో కలిసి సమైక్య ఉద్యమాలు చేపడతామన్నారు.
Read Also: Fraud: పంది పిల్లల వ్యాపారంలో పెట్టుబడి పెట్టండంటూ.. వందల కోట్లకు కుచ్చుటోపీ