Site icon NTV Telugu

CPI Narayana: ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక భారతీయులకు రక్షణ లేదు..

Cpi Narayana

Cpi Narayana

ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక భారతీయులకు రక్షణ లేదని సీపీఐ నేషనల్ సెక్రటరీ నారాయణ అన్నారు. అమెరికాలో తాజా పరిస్థితిపై ఆయన మీడియాతో మాట్లాడారు. “మోడీ వివిధ దేశాల అధినేతలతో సమావేశాలకే పరిమితం అవుతున్నారు.. ప్రపంచంలో అత్యంత శక్తి వంతమైన దేశం గా ఉన్న అమెరికా బెదిరింపులకు దిగడం సరికాదు.. ఇతర దేశాల సంపదను కొల్ల గొట్టేందుకు అమెరికా ప్రయత్నం చేస్తుంది.. ఎలాన్ మాస్క్ తో డిబేట్ సందర్బంగా విధి రౌడీ లాగ ట్రంప్ ప్రవర్తన ఉంది.. ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ కు వస్తున్నా వ్యతిరేతను భారత్ తరుపున మోడీ ఉపయోగించుకోవాలి.. లేదంటే వంద కోట్ల భారతియుల ప్రయోజనాలను అమెరికా కు తాకట్లు పెట్టినట్లు అవుతుంది.. ప్రపంచ పెట్టుబడి దారులంతా ఏకం అయ్యే ప్రమాదం ఉంది.. దీనిమీద చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పి.. మోడీతో ట్రంప్ కు చెప్పించే బాధ్యత చంద్రబాబు తీసుకోవాలి..” అని నారాయణ వ్యాఖ్యానించారు.

READ MORE: Venkatesh: 303 కోట్ల రీజనల్ బ్లాక్ బస్టర్..20 కథలు కాదని డిజాస్టర్ డైరెక్టర్ కి ఛాన్స్?

అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను అక్కడి ప్రభుత్వం వెనక్కి పంపిస్తోంది. ఇప్పటికే మిలిటరీ విమానంలో వందలాది మంది భారతీయులకు తిరిగి పంపించింది. ఈ అంశంపై ఇప్పటికే ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ.. ఈ అంశంపై స్పందించారు. అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించిన వారిని తొలుత అమెరికా తిప్పి పంపిందన్నారు. వారంతా అమెరికా భద్రతకు ముప్పుగా పరిణమించారని అక్కడి ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు.

Exit mobile version