NTV Telugu Site icon

CPI Narayana: రాజకీయాల్లో గర్వం, అవినీతి, నియంతృత్వం ఉన్నవాళ్లు ఎప్పటికీ బాగుపడరు..

Cpi Narayana

Cpi Narayana

CPI Narayana: రాజకీయాల్లో గర్వం, అవినీతి, నియంతృత్వం ఉన్నవాళ్లు ఎప్పటికీ బాగుపడరని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. దేశంలో రైతు బంధు ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే ఖమ్మం ప్రాంతంలో అనేక రోడ్లు వేసిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియంతృత్వం వల్లనే ఓడిపోయారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరూ కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

Read Also: TG Governor: జయశంకర్‌కు నివాళులు అర్పించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

బంగ్లాదేశ్‌లో ప్రధానమంత్రికి ఏ ఖర్మ పట్టిందో మనం చూస్తున్నామన్నారు. ప్రతిపక్షం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు కానీ కేంద్రంలో మోడీ అన్ని మీడియా సంస్థలను చేతిలో పెట్టుకుని ప్రతిపక్షాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు. గత ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి మోడీకి తన నియోజకవర్గంలో చాలా తక్కువ ఓట్లు వచ్చాయని, అలాగే దేశవ్యాప్తంగా బీజేపీ బలహీన పడిందన్నారు సీపీఐ నారాయణ. అయినా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్‌ల సహకారంతో బ్లాక్ రాజకీయాలతో మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడని ఆయన విమర్శించారు.