తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై కీలక వ్యాఖ్యుల చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగూడెం, బెల్లంపల్లి టికెట్లు కోరామని, బెల్లంపల్లి కాకుండా చెన్నూరు తీసుకోమన్నారన్నారు. సీపీఎం సీట్లపై చర్చ జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఇంకా సీపీఎం సీట్లపై స్పష్టత రాలేదని ఆయన వెల్లడించారు. రేపో మాపో మిగతా అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటిస్తుందని, ఇండియా కూటమి బలపడటం వల్ల బీజేపీని నిలవరించవచ్చని సీపీఐ నారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఊహాగానాలను తాము నమ్మమని, వివేక్ కాంగ్రెస్ లో చేరడం మంచి పరిణామన్నారు నారాయణ. చెన్నూరులో సీపీఐ గెలుపుకు వివేక్ కృషి చేస్తారని, పార్లమెంట్ ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామి విజయం కోసం కృషి చేస్తామన్నారు సీపీఐ నారాయణ.
Also Read : Gudivada Amarnath: తాత విదేశాలకు వెళ్లాడని చెప్పి.. మనవడిని జైలుకు ఎందుకు తీసుకొచ్చారు..!
అనుమానాలు, ఊహాగానాలతో పొత్తును చెడగొట్టుకోలేమని ఆయన వ్యాఖ్యానించారు సీపీఐ నారాయణ. ఇప్పటివరకు ఆ స్థానాలు తమకు ఇవ్వబోమని కాంగ్రెస్ ఎక్కడా చెప్పలేదన్నారు. సీపీఐ(ఎం)తో చర్చలు జరుగుతున్నాయని, ఒకేసారి ప్రకటన చేయాలని చూస్తున్నారని ఆయన తెలిపారు. తమకు స్థానాలు ఇవ్వము అని కాంగ్రెస్ ఎక్కడా చెప్పలేదన్నారు. అభ్యర్థుల ఖరారుపై మీడియా వార్తల్లో వాస్తవం లేదని ఆయన ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితమైందని ఆయన విమర్శించారు. న్యాయం బతికే ఉన్నందని చెప్పడానికే బెయిల్ అని, ఇది రాజకీయ కక్ష అని, జైల్లో ఉండాల్సిన వాళ్లు బయట.. బయట ఉండాల్సిన వాళ్లు లోపల ఉన్నారంటూ సీపీఐ నారాయణ వ్యాఖ్యలు చేశారు.
Also Read : IND vs SL: భారత్-శ్రీలంక ప్రపంచకప్ సమరం.. లాస్ట్ 5 మ్యాచ్‌లలో ఎవరిది పైచేయంటే?