NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీలో కాంగ్రెస్ తో లెఫ్ట్ పార్టీల సమావేశం.. ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ

Congress

Congress

ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో లెఫ్ట్ పార్టీల నేతలు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో సీట్ల పంపకంతో పాటు ఉమ్మడి మేనిఫేస్టోపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తామన్నారు. పెద్ద ఎత్తున బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు.. ప్రజాతంత్ర, కమ్యూనిష్టు, లౌకిక పార్టీలు ఒక వేదిక మీదకు వస్తాం అని ఆయన తెలిపారు. ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఏపీలో భయపడుతున్నాయి.. మోడీ అంటే పవన్, చంద్రబాబు, జగన్ లకు భక్తి ఏమీ లేదు.. జీ హుజూర్ అంటూ లొంగిపోతున్నాయి స్ధానిక పార్టీలు.. బీజేపీ అధికారంలోకి రావాలనే వారి ఓట్లు మాకు అక్కర లేదు.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.. పీసీసీ అధ్యక్షురాలు, మహిళకు తన అభిప్రాయం వెలిబుచ్చే హక్కు లేదు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

Read Also: SRH Schedule 2024: ఫ్యాన్స్ గెట్ రెడీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే! ఉప్ప‌ల్‌లో ఎన్ని మ్యాచ్‌లంటే?

ఇక, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బీజేపీ, బీజేపీకి కొమ్ము కాసే వారికి వ్యతిరేకంగా పోరాడాలన్నది మా మొదటి ఏకాభిప్రాయం అని ఆయన తెలిపారు. చెత్త బుట్టలో వేసిన బీజేపీతో ఎందుకు కలుస్తున్నారు అనేది చంద్రబాబు సంజాయిషి ఇవ్వాలి.. ఆత్మాభిమానాన్ని ఢిల్లీ పాలకులకు తాకట్టు పెట్టడాన్ని ప్రజలు సహించరు.. ఢిల్లీ చుట్టూ సీఎం ఎందుకు తిరుగుతున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో కాంగ్రెస్- సీపీఐ- సీపీఎం పార్టీలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాం.. పరస్పర పోటీలను నివారించి దుష్ట కూటమిలను ఓడించాలని నిర్ణయించామని శ్రీనివాసరావు పేర్కొన్నారు.