CP Sajjanar: న్యూ ఇయర్ వేడుకలను ఎలాంటి అపశృతి లేకుండా, శాంతియుతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు భారీ స్థాయిలో చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ కీలక వివరాలు వెల్లడించారు. జంటనగరల వ్యాప్తంగా ఈ రోజు రాత్రి మొత్తం 100 డ్రంక్ అండ్ డ్రైవ్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాగి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడవద్దని, ఇతరులకు ఇబ్బందులు కలిగించకూడదని డీసీపీ సూచించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నగరంలోని ఫ్లైఓవర్లను మూసివేస్తామని ప్రకటించారు. అలాగే ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్‌పై వాహనాలకు అనుమతి లేదని, కేవలం నెక్లెస్ రోడ్డుపైనే వాహనాలను అనుమతిస్తామని స్పష్టం చేశారు. న్యూ ఇయర్ ఈవెంట్లు నిర్వహించే ఆర్గనైజర్లు రోడ్లపై వాహనాలు పార్క్ చేయకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు.
అండర్ డిస్‌ప్లే 3D ఫేస్ రికగ్నిషన్ సపోర్ట్ తో రానున్న Xiaomi Mix 5..!
మరోవైపు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ న్యూ ఇయర్ నేపథ్యంలో క్యాబ్, ఆటో డ్రైవర్లకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఈ రోజు అర్ధరాత్రి క్యాబ్ లేదా ఆటో రైడ్‌కు నిరాకరిస్తే చర్యలు తప్పవని చెప్పారు. అలాగే బుక్ చేసిన చార్జ్ కంటే అధికంగా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లపై మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 178(3)(b) కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదులో వాహన నంబర్, సమయం, ప్రదేశం వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలని, అలాగే రైడ్ డీటెయిల్స్ స్క్రీన్‌షాట్ పంపాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు. ఫిర్యాదుల కోసం హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 9490616555ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
Vaishnavi Sharma: కుర్రాళ్ల మనసు కొల్లగొడుతున్న కొత్త టీమిండియా బౌలర్.. సరికొత్త క్రష్ అంటూ..!
అలాగే డ్రంక్ డ్రైవింగ్‌పై సీపీ సజ్జనార్ మరోసారి కఠినంగా స్పందించారు. “తాగి డ్రైవ్ చేస్తే తప్పకుండా పట్టుబడతారు. ఇక్కడ షార్ట్‌కట్స్ లేవు, చాకచక్యాలు పనిచేయవు” అని హెచ్చరించారు. కొద్దిగా మద్యం తాగిన తర్వాత పోలీసులను మోసం చేయగలమని అనుకుంటే అది పెద్ద పొరపాటేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ పోలీసులు చేపట్టిన వ్యూహాత్మక డ్రంక్ డ్రైవ్ తనిఖీలు చక్రవ్యూహం లాంటివని, అందులో పడితే తప్పించుకునే మార్గమే లేదన్నారు. “ఈ చక్రవ్యూహంలో ఎగ్జిట్ ఇంటికి కాదు… నేరుగా చంచల్‌గూడ జైలుకే” అంటూ హెచ్చరించారు.
