నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్య చేసిన కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. రియాజ్ ఎన్ కౌంటర్ పై సీపీ సాయి చైతన్య కీలక విషయాలు వెల్లడించారు. రియాజ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గది అద్దాలు ధ్వంసం చేశాడని తెలిపారు. చెకింగ్ లో భాగంగా ఆర్ ఐ గది వద్దకు వెళ్ళగానే శబ్దం వినిపించటంతో రూమ్ లోకి వెళ్ళాడని చెప్పారు. ఈ సమయంలో రియాజ్ కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకి లాక్కున్నాడని అన్నారు.
Also Read:Fraud: ఐటీ మినిష్టర్ పేషీ పేరుతో రూ. 1.77 కోట్ల మోసం.. సీసీఎస్ పోలీసుల దర్యాప్తు..
ఆ తర్వాత రియాజ్ ట్రిగ్గర్ లాగే ప్రయత్నం చేసి పోలీసులపై కాల్పులు జరిపేందుకు తెగబడ్డాడని వెల్లడించారు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా గత్యంతరం లేక ఆర్ ఐ రియాజ్ పై కాల్పులు జరపాల్సి వచ్చిందని సీపీ తెలిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. ప్రొసీజర్ ప్రకారం పోస్ట్ మార్టం జరుగుతుందని తెలిపారు. రియాద్ దాడిలో గాయపడిన అఫీజ్ రెండు చేతులకు తీవ్ర గాయ్యాలయ్యాయి.. అతని చేతులు పనిచేయాలంటే ఏడాది కాలం పడుతుందని సీపీ వెల్లడించారు.