వరంగల్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటిలో విద్యార్థుల గోడవపై కేయూ వీసీ తాటికొండ రమేష్ తో కలిసి సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ రంగనాథ్ మాట్లాడుతూ.. కాకతీయ విశ్వవిద్యాలయంలో గొడవ చేసిన వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. సీపీ సమక్షంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కొట్టారని వారు ఆరోపిస్తున్నారు.. ఏబీవీపీ విద్యార్థులు 4న డోర్ పగులగొట్టి వీసీ కార్యాలయంలోకి చొరబడ్డారు అని సీపీ తెలిపారు.
Read Also: Sreeleela: ఇక ప్రతి పండక్కి శ్రీలీల కనపడాల్సిందే.. మామూలు రికార్డు కాదుగా ఇది!
5న ప్రిన్సిపల్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారని సీపీ రంగనాథ్ తెలిపారు. వారిని అరెస్టు చేసే క్రమంలో తోపులాట జరిగింది.. డాక్టర్ ముందు ఎలాంటి గాయాలు లేవని చెప్పారు.. ప్రాపర్ గా మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని ఆయన చెప్పారు. మెజిస్ట్రేట్ ముందు పోలీసులు కొట్టారని చెప్పడంతో మెడికల్ రీ ఎగ్జామ్ చేయాలని ఆదేశించారు.. తోపులాట జరిగినప్పుడు గాయాలు కావడం సహాజం.. కానీ పోలీసులు కొట్టారని, గన్ తో కాల్చుతారని బెదిరించామనేది అబద్దం అని సీపీ రంగనాథ్ తెలిపారు.
Read Also: Sathyaraj: ఉదయనిధి స్టాలిన్ కు సపోర్ట్ గా కట్టప్ప.. ఆయన అందరికీ గర్వకారణం
శాంతియుతంగా ధర్నా చేస్తే కొట్టారనడం వాస్తవం కాదు అని వరంగల్ కమిషనర్ రంగనాథ్ అన్నారు. బైరీ నరేష్ పై దాడి చేసిన ఘటనపై హత్యాయత్నం అయినప్పటికీ విద్యార్థులని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వదిలేశామని ఆయన చెప్పుకొచ్చారు. విద్యార్థులు విద్యాసంస్థపై దాడి చేయడం సమంజసం కాదు.. చట్టాలను చేతిలోకి తీసుకుని దాడులు చేస్తామంటే చూస్తు ఊర్కోమని సీపీ హెచ్చరించారు. తప్పులు ఉంటే వేలెత్తి చూపండి.. లీగల్ గా వెళ్ళండి.. కానీ విచక్షణ రహితంగా దాడులు చేస్తే ఊర్కోం..
పీహెచ్డీ అడ్మిషన్లు మెరిట్ ప్రకారమే జరిగాయి.. బాధ్యతగల విద్యార్థులు దాడులు చేస్తారా?.. అంబాల కిరణ్ పై 8 క్రిమినల్ కేసులు ఉన్నాయి.. రాజకీయాలతో మాకు సంబంధం లేదు.. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు అని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు.