Sreeleela Movies for every festival upto Sankranthi: మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారిపోయిన శ్రీ లీల వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఒక్క తెలుగులోనే ఆమె అరుడజనుకు పైగా సినిమాల్లో నటిస్తోంది అంటే ఆమె క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు శ్రీ లీలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఇప్పుడు రాబోతున్న మిలాద్-ఉన్-నబి పండుగ మొదలు సంక్రాంతి వరకు ప్రతి పండుగకు ఆమె నటించిన సినిమా రిలీజ్ అవుతోంది. బహుశా ఇలాంటి రికార్డు మరే హీరోయిన్ కి లేదేమో. సెప్టెంబర్ 28వ తేదీన ఈద్ మిలాద్-ఉన్-నబి గణేష్ నిమజ్జనం సందర్భంగా స్కంద సినిమా రిలీజ్ అవుతుంది. రామ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా ఈ సినిమాని బోయపాటి శ్రీను డైరెక్ట్ చేశాడు.
Jaffer Sadiq: నక్క తోక తొక్కాడురా.. జవాన్ లోనూ కూడా జాఫర్ సాధిక్ రచ్చ
తర్వాత దసరా సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన భగవంత్ కేసరి సినిమా రాబోతోంది. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్టు చేశాడు. అదేవిధంగా నవంబర్ 10వ తేదీన పంజా వైష్ణవ తేజ్ హీరోగా నటించిన ఆదికేశవ సినిమా దీపావళి సందర్భంగా రిలీజ్ అవుతుంది. ఇక డిసెంబర్ 23వ తేదీన క్రిస్టమస్ సందర్భంగా నితిన్ వక్కంతం వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ రిలీజ్ అవుతుంది, అదే విధంగా జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా మహేష్ బాబు హీరోగా శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న గుంటూరు కారం రిలీజ్ అవుతుంది. వాస్తవానికి ప్రస్తుతం ప్రకటించిన డేట్ల ప్రకారం ఈ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పలేం కానీ లేదంటే వరుస పండుగలకు సినిమాలతో సందడి చేస్తున్న హీరోయిన్గా శ్రీ లీల రికార్డులకు ఎక్కనుంది.