దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. గత మూడు నెలల కాలం నుంచి తగ్గుతూ వస్తున్న కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. పది రోజుల క్రితం వరకు రోజూ వారీ కేసుల సంఖ్య కేవలం 3 వేలకు దిగువనే ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం కేసుల సంఖ్య 10 వేలను దాటుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు పెరుగుతోంది. దీంతో మళ్లీ ప్రజల్లో కరోనా భయాలు నెలకొన్నాయి. ఫోర్త వేవ్ తప్పదా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండే దేశంలో నమోదయ్యే కేసుల్లో ఎక్కువగా ఢిల్లీ, కేరళ, మహారాష్ట్రల్లోనే నమోదు అవుతున్నాయి. మహరాష్ట్రలో నమోదు అవుతున్న కేసుల్లో సగం కేసులు ఒక్క ముంబై మహానగరంలోనే ఉంటున్నాయి.
తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 12,899 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 15 మంది మరణించారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 72,474కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,518 రికవరీలు నమోదు అయ్యాయి. దేశంలో మొత్తంగా 5,24,855 మరణాలు నమోదు కాగా.. 4,26,99,363 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల శాతం 0.17 కాగా, రికవరీ రేటు 98.62 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
అదికారిక లెక్కల ప్రకారం దేశంలో రోజూవారీ పాజిటివిటీ రేటు 2.89 శాతం కాగా.. వారం పాజిటివిటీ రేటు 2.50శాతంగా నమోదు అయింది. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. దేశంలో ఇప్పటి వరకు అర్హులైన వారికి 196.14 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించారు. గడిచిన 24 గంటల్లో 4,46,387 వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
COVID19 | India reports 12,899 fresh infections & 15 deaths today; Active cases rise to 72,474 pic.twitter.com/aqHyJhGTdn
— ANI (@ANI) June 19, 2022