Site icon NTV Telugu

Physical Harassment: పార్క్‌లో ఓ మహిళతో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ అసభ్య ప్రవర్తన.. జైలుశిక్ష విధించిన కోర్టు

Ifithikar

Ifithikar

మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా భయపడకుండా.. వారు చేసే పని వారు చేస్తూనే ఉన్నారు కామాంధులు. తాజాగా.. కేరళలోని కన్నూర్‌లో ఓ మహిళపై లైంగిక వేధింపుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. కాగా.. ఈ కేసులో పోలీసులు చర్యలు తీసుకుని కేరళ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో.. నిందితుడు ఇఫ్తికార్ అహ్మద్‌ను విస్మయ ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన తరువాత, స్థానిక కోర్టులో హాజరుపరిచారు. అక్కడ కోర్టు అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించి జైలుకు పంపిందని పోలీసులు తెలిపారు.

Read Also: Aparichithudu: అపరిచితుడు మళ్ళీ వస్తున్నాడు… జాగ్రత్త!

22 ఏళ్ల బాధిత మహిళ.. తన కుటుంబ సభ్యులతో కలిసి వినోద ఉద్యానవనంలోని వేవ్ పూల్‌లో గడుపుతున్నప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. మొదటిసారి ఫ్రొపెసర్ ప్రవర్తనను పట్టించుకోలేదని.. ఆ తర్వాత మళ్లీ అదే దుశ్చర్యకు పాల్పడ్డాడని బాధితురాలు చెప్పింది. ఈ క్రమంలో.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. బాధిత ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు అహ్మద్‌పై మహిళ గౌరవానికి భంగం కలిగించడం, లైంగిక వేధింపుల కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. అహ్మద్‌పై ఇప్పటికే సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థి లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Read Also: Double ISmart: ‘డబుల్ ఇస్మార్ట్ ‘ నుంచి సర్ ప్రైజ్ వీడియో వచ్చేసింది..

Exit mobile version