Aparichithudu: అపరిచితుడు మళ్ళీ వస్తున్నాడు… జాగ్రత్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aparichithudu to Re Release on May 17th: సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, ప్రముఖ నిర్మాత వీ రవిచంద్రన్ కాంబినేషన్‌లో విక్రమ్, సదా నటించిన అపరిచితుడు సినిమా చాలా మందికి ఇష్టమైన సినిమాల్లో ఒకటి. ప్రభుత్వ అధికారుల్లో అవినీతి, అక్రమాల కథ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా 2005లో రిలీజై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా విక్రమ్‌ను స్టార్ హీరోగా, కమర్షియల్ హీరోగా మార్చగా అప్పటి నుంచి మార్కెట్లో దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం రీ రిలీజ్‌ల హవా కొనసాగుతున్న నేపథ్యంలో అపరిచితుడు సినిమాను మే 17వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఆస్కార్ సినిమా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని 20 కోట్ల రూపాయలతో నిర్మించగా సుమారుగా 60 కోట్ల రూపాయల షేర్ ప్రపంచవ్యాప్తంగా సాధించి పెట్టింది. ఈ సినిమా ఆ ఏడాది రిలీజైన అన్ని చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
Double ISmart: ‘డబుల్ ఇస్మార్ట్ ‘ నుంచి సర్ ప్రైజ్ వీడియో వచ్చేసింది..
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
ఈ సినిమాలో విక్రమ్, ప్రకాశ్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు హై ఓల్టేజ్‌ను అందించగా విక్రమ్ నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు చూడగలిగారు. ద్విపాత్రాభినయంతో రెమో అనే అపరిచితుడుగా, బ్రాహ్మణుడిగా రెండు పాత్రల్లో దుమ్మురేపారు. ఇక ఈ సినిమాకు హ్యారీష్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. ఆయన రూపొందించిన పాటలు చార్ట్‌బస్టర్‌లో బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ సాంగ్స్ కుర్రకారును ఉర్రూతలూగించాయి. ఇలాంటి సినిమాను రీ రిలీజ్ అవుతుందంటే.. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తెలుగు, తమిళ రాష్ట్రాల్లో అపరిచితుడు రీరిలీజ్‌కు అంతా సిద్దమైంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ మొదలవ్వగా మంచి స్పందన కనిపిస్తుంది. ఎన్నికల తర్వాత సరైనా సినిమా థియేటర్‌లో లేకపోవడంతో విక్రమ్ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తుందని ఆశిస్తున్నారు నిర్మాతలు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..