Corona Cases: తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corona Cases: కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 60 వేలు దాటింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 52 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్క హైదరాబాద్‌లోనే 21 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది.
Read Also: Medical College: జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుమతి
Also Read
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. టీకాల పంపిణీపై కేంద్రం చేతులెత్తేయడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రేపటి (బుధవారం) నుంచి తెలంగాణలో మళ్లీ కోవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ చేయనున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ సరఫరా నిలిపివేయడంతో తెలంగాణ ప్రభుత్వం టీకాల పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. 5 లక్షల కార్బేవ్యాక్స్ టీకా డోసులను ప్రజలకు రాష్ట్ర సర్కారు అందుబాటులోకి తెచ్చింది. బుధవారం నుంచి రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. మొదటి రెండు డోసులు కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ తీసుకున్నా బూస్టర్ డోస్‌గా కార్బే వ్యాక్స్ తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..