మనదేశంలో ఎక్కువగా పండిస్తున్న వాణిజ్య పంటలల్లో మొక్క జొన్న కూడా ఒకటి.. ఈ పంటను చలికాలంలోనే ఎక్కువగా పండిస్తారు.. ఈ కాలంలో మంచు వల్ల పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది.. అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడిని పొందుతారు. ఆ జాగ్రత్తలు ఏంటో వ్యవసాయ నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
మొక్కజొన్న కోతలు, నూర్పిడిల తరువాత వచ్చిన గింజలలో తేమ ఉంటుంది. నిలువలలో బూజులు ఆశించకుండా ఉండేందుకు నూర్పిడి చేసిన మొక్కజొన్నలు 4 రోజులు ఎండబెట్టి తేమను తగ్గించుకోవాలి… మొక్కజొన్న గింజలను శుభ్రమైన గోనె సంచులు , పాలిథిన్ సంచులలో తక్కువ తేమ గల ప్రాంతాలలో అంటే మంచు కురవని ప్రాంతాలలో నిల్వ చేయాలి. నిల్వ చేసే సమయంలో ఎలుకలు, పురుగులు, శిలీంధ్రాలు, తేమ వల్ల నష్టం జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి…
గింజలను ఆరబెట్టి గ్రేడింగ్ వేసిన తర్వాత గ్రేడింగు చేసి తగిన నాణ్యత ప్రమాణాలతో మంచి ధరికి అమ్ముకోవచ్చు. మంచి ధరకు అమ్ముకోవాలంటే తేమ 14శాతం, నంగే మారిన గింజలు 4.5 శాతం కంటే తక్కువ, పాడైపోయిన గింజలు 1.5 శాతం కంటే తక్కువ, సైజు తక్కువ ఉన్న గింజలు 3శాతం కంటే తక్కువ ఉండాలి.. అలా ఉంటేనే మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. లేకుంటే ధర తక్కువగా పలుకుతుంది..
కండిలను కోసిన తర్వాత మిగిలిన చొప్పను ట్రాక్టరు సహాయంతో నడిచే యంత్రం తో చిన్నచిన్న ముక్కలుగా చేయాలి. ఈ ముక్కలు రోటోవేటరుతో నేలలో కలిసేలా రోటోవేటరు తో దున్నుకోవాలి. నేలలో కలిసి కుల్లిపోతే పోషక విలువల స్ధాయి పెరుగుతుంది.. ఈ చొప్పలో 35 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ ఉంటుంది. వీటితో పాటు అనేక ఉప సూక్ష్మ పోషకాలు నేలకు అంది నేలకు సారాన్ని అందిస్తాయి.. తర్వాత పంటకు మంచిది..