కరోనా కారణంగా మూతబడ్డ థియేటర్స్, ప్రతి స్టార్ హీరోకి నెపోటిజం మరకలు, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి పాన్ ఇండియా దండయాత్రలు, సొంత ఆడియన్స్ నుంచి బాయ్కాట్ విమర్శలు… ఇన్ని కష్టాల మధ్య హిందీ చిత్ర పరిశ్రమ నలిగిపోతుందా? దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉన్న బాలీవుడ్ ఇక కోలుకోదా అనే చర్చల మధ్య సేవియర్ గా బయటకి వచ్చాడు షారుఖ్ ఖాన్. కింగ్ ఖాన్ గా, బాక్సాఫీస్ బాద్షాగా పేరున్న షారుఖ్ తనని కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ అని ఎందుకు అంటారో చూపిస్తూ, బాలీవుడ్ కష్టాలకి ఎండ్ కార్డ్ వేస్తూ ‘పఠాన్’ సినిమాతో జనవరి 25న ఆడియన్స్ ముందుకి వచ్చాడు. డే 1 నుంచి ఎనిమిది వారాలు గడుస్తున్నా ఈరోజు వరకూ బాక్సాఫీస్ దగ్గర స్లో అయ్యిందే లేదు. హిందీలో బాహుబలి 2, దంగల్, KGF 2… ఇలా టాప్ మోస్ట్ సినిమాల రికార్డ్స్ అన్నింటినీ ఒక్క సినిమాతో తన పేరుప్పైకి మార్చుకున్నాడు షారుఖ్ ఖాన్.
యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటివరకూ వరల్డ్ వైడ్ గా 1050 కోట్లు రాబట్టింది. సినిమా కంటెంట్ యావరేజ్ గా ఉన్నా షారుఖ్ ఖాన్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో, సల్మాన్ ఖాన్ క్యామియోతో మ్యాజిక్ చేసి బాలీవుడ్ కష్టాలకి ఎండ్ కార్డ్ వేశారు. థియేటర్స్ లో హ్యుజ్ ప్రాఫిట్స్ ని దక్కించుకున్న పఠాన్ సినిమా ఎట్టకేలకు ఎనిమిది వారాల తర్వాత ఒటీటీలోకి వచ్చేస్తుంది. మార్చ్ 22 నుంచి పఠాన్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ప్రిమియర్ కానుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ అమెజాన్ ప్రైమ్ షారుఖ్ ఖాన్ తో చేయించిన ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేసింది. మరి థియేటర్స్ తో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ల యాక్షన్ ని మిస్ అయిన వాళ్లు ఒటీటీలో పఠాన్ పై ఒక లుక్కెయ్యండి.
we sense a turbulence in the weather, after all Pathaan is coming!#PathaanOnPrime, Mar 22 in Hindi, Tamil and Telugu @iamsrk @deepikapadukone @TheJohnAbraham #SiddharthAnand @yrf pic.twitter.com/MnytnUqZEj
— prime video IN (@PrimeVideoIN) March 20, 2023