Google Layoff: హై టాలెంటెడ్ ఉద్యోగులను కూడా వదలడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Layoff: గత ఏడాది కాలంగా టెక్ కంపెనీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. గత నవంబర్ నుంచి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తీసేశాయి. ఇప్పటికే ఈ ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతూనే ఉంది. కొన్ని సంస్థలైతే దశాబ్ధాలుగా పనిచేస్తున్న ఉద్యోగులను కూడా వదిలిపెట్టలేదు. ఇన్నేళ్లు పనిచేశారనే కనికరం కూడా లేకుండా ఉద్యోగం నుంచి తీసిపారేశాయి.
ఇదిలా ఉంటే టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగించినట్లు సీఎన్బీసీ బుధవారం నివేదించింది. గూగుల్ తన వార్తా విభాగంలో చాలా మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు తెలిపింది. గూగుల్ న్యూస్ లో 40 నుంచి 45 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే తమకు ఖచ్చితమైన సంఖ్య తెలియదని, ఇంకా వందలాది మంది న్యూస్ ప్రొడక్షన్ లో పనిచేస్తున్నారని ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. మా సంస్థను క్రమబద్ధీకరించడానికి కొన్ని అంతర్గత మార్పులు చేస్తున్నామని, తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ప్రభావితమయ్యారని తెలిపారు.
Also Read
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
- September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
Read Also: Putin: పుతిన్ ప్రసంగ సమయంలో యూరప్ ప్రతినిధుల వాకౌట్..
లేఆఫ్స్ గురించి గూగుల్ ఉద్యోగి లింక్డ్‌ఇన్ లో పెట్టిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గూగుల్ లో స్టాఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన రాబ్.ఆర్ తన పోస్టులో కొందరు హై టాలెంటెడ్, అత్యుత్తమ వ్యక్తులను కూడా తొలగించారని వెల్లడించారు. ఈ నిర్ణయం వెనక ఉన్న లెక్కలు తనకు అర్థం కావడం లేదని.. వారు లేకుండా, మేము ఖచ్చితంగా అధ్వాన్నంగా ఉన్నామని ఆయన రాశారు.
ఇదిలా ఉంటే తాజా రౌండ్ లేఆఫ్స్ తమను ప్రభావితం చేయలేవని గూగుల్ పేర్కొంది. ఈ ఏడాదిల జనవరిలో గూగుల్ 12,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. ఒక్క గూగుల్ మాత్రమే కాదు మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, నోకియా వంటి సంస్థలు కూడా తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
తాజావార్తలు
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!