కర్ణాటక లో కాంగ్రెస్ గెలుపు ఖాయం అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ వస్తే తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తది అని ఆయన కామెంట్స్ చేశారు. బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ పనిచేసిండు అని ఆయన విమర్శలు గుప్పించాడు. జేడీఎస్ తో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కుమారస్వామి సింగపూర్ లో ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి చక్రం తిప్పే పనిలో ఉన్నారని అన్నారు.
Also Read : Sudigali Sudheer: ఏయ్ .. ఏయ్.. సుధీర్ అన్నా.. ‘బ్యాచిలర్’ భామతో రొమాన్సా..
కర్ణాటకలో ఎంఐఎం ఎందుకు పోటీ చేయలేదు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటే అనేది కర్ణాటక ఎన్నికల్ల స్పష్టమైంది అని ఆయన అన్నారు. కర్ణాటకలో తెలుగు ఓటర్లు ప్రభావితం చేసే సెగ్మెంట్లు 78 వరకు వున్నాయి. మరి ఆ సెగ్మెంట్ల ప్రజలకు కేసీఆర్ బీజేపీని ఓడించమని ఎందుకు పిలుపునివ్వలేదు అని రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేశారు.
Also Read : Wrestlers Protest: లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్ భూషణ్‌పై విచారణకు సిట్ ఏర్పాటు..
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ట్రైనింగ్ సెంటర్ గా మారబోతుంది గాంధీ ఐడియాలజీ సెంటర్ మారనుంది అని టీపీసీసీ చీఫ్ అన్నారు. 365 రోజులు గాంధీజీ ఐడియాలోజి సెంటర్ పని చేస్తది.. ఎంతో కష్టపడి దీన్ని డెవలప్ చేస్తున్నాం.. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే లీడర్లు ఇక్కడ శిక్షణ తీసుకుంటారు అని రేవంత్ రెడ్డి అన్నారు. స్లాట్ల వారీగా బుక్ చేసుకుంటారు.. ఎయిర్ పోర్ట్ కు 40 నిమిషాల్లో రావడానికి వీలుంది.. పక్కనే రాష్ట్రపతి నిలయం వుంది.. ఇలాంటి ప్లేస్ ఎక్కడ లేదు.. అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు వాడుకోడానికి వీలుంది అని రేవంత్ అన్నారు.
Also Read : Vikarabad : అనంతరగిరిలో టెర్రరిస్ట్ లు ట్రైనింగ్ తీసుకునే ఛాన్స్ లేదన్న ఎస్పీ
ఇంటెర్నేషన్ స్థాయిలో ట్రైనింగ్ సెంటర్, వసతి గదుల నిర్మాణం చేయబోతున్నాం అని రేవంత్ రెడ్డి చెప్పాడు. ఈ ల్యాండ్ అలర్ట్ చేసిన నేత చనిపోయారు.. నాకు ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది.. మా పార్టీకే భూ కేటాయింపులు జరుగలేదు.. అన్ని పార్టీలకు భూకేటాయింపులు జరిగాయి.. మరి క్యాన్సిల్ చేస్తే.. అన్ని పార్టీలకు చేయ్యాల్సి ఉంటది అని అన్నారు. కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో క్యాన్సిల్ చేయ్యాలని అనుకున్నారు.. దానికి కౌంటర్ దాఖలు చేశాను.. సర్కార్ ఈ భూమిని లాక్కునే ప్రయత్నం చేసింది అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
