Unemployment Protest Rally: నేడు ఖమ్మంలో కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన ర్యాలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Unemployment Protest Rally in Khammam: తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన ఉద్యమ కార్యాచరణ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ వరుసగా నిరుద్యోగ నిరసన ర్యాలీలు, దీక్షలకు పిలుపునిచ్చింది. పేపర్ లీకేజీలు, ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యార్థి వ్యతిరేక విధానాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో జాప్యం వంటి తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయించింది. నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఇవాళ ఖమ్మంలో జరగనున్న నిరుద్యోగ ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
Read Also: Supreme Court: సుప్రీంకోర్టులో గవర్నర్ బిల్లుల పెండింగ్ అంశంపై నేడు విచారణ
Also Read
- Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Paper Leaks: పంజాబ్‌లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
నేటి నుంచి వరుసగా నిరుద్యోగ నిరసన ర్యాలీలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. ఇందులో భాగంగా నేడు ఖమ్మంలో, ఈ నెల 26న ఆదిలాబాద్… ఈ నెల 28న నల్గొండ, 30న తేదీన మహబూబ్‌నగర్… వచ్చే నెల ఒకటో తేదీన రంగారెడ్డి జిల్లాల్లో సన్నాహక ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే నెల నాలుగైదు తేదీల్లో హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఆ సభకు ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తుండడంతో తగిన ఏర్పాట్లపై పీసీసీ దృష్టి సారించింది. నిరుద్యోగ నిరసన సభలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజా వ్యతిరేక ఓటును తమవైపు తిప్పుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇవాళ ఖమ్మం నగరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి.. సాయంత్రం 4 గంటల వరకు భారీ ప్రదర్శన.. మయూరి సెంటర్, పాత బస్టాండ్ వరకు కొనసాగుతుందని టీపీసీసీ తెలిపింది. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు ఇతర సీనియర్ నాయకులు పాల్గొంటున్నారని.. కాంగ్రెస్ కార్యకర్తలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఈ ర్యాలీకి భారీగా తరలిరావాలని టీపీసీసీ పిలుపునిచ్చింది.
తాజావార్తలు
-
Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
-
Paper Leaks: పంజాబ్‌లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?