Congress: ఐటీ నోటీసులపై దేశ వ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐటీ శాఖ నోటీసులపై కాంగ్రెస్ మండిపడుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. తమపై ఐటీ చర్యలను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన వెంటనే.. కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులు జారీ చేసింది. 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1823 కోట్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఎన్నికల్లో డబ్బు లేదని ఆ పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్న సమయంలో మరోసారి ఐటీ నోటీసులు ఇవ్వడంపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: RR vs DC: అంఫైర్తో పాంటింగ్, గంగూలీ వాగ్వాదం.. కాసేపు ఆగిన మ్యాచ్.. ఇంతకీ ఏమైందంటే..!
Also Read
- Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
- Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
- Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
ఐటీ శాఖ నోటీసులను నిరసిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిరసనలకు పిలుపునిచ్చింది. శనివారం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్ర విభాగాలను కోరారు. పీసీసీ ప్రధాన కార్యాలయాల దగ్గర, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయాల దగ్గర ధర్నా చేయాలని అధిష్టానం ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకే కేంద్రం ఇలా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని కాంగ్రెస్ మండిపడింది.
ఇది కూడా చదవండి: Chandrababu: ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభించిన గొప్ప రోజు ఇది..
2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీంతో శుక్రవారం 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1800 కోట్లకుపైగా డిమాండ్ నోటీసులను ఐటీ పంపించింది.
మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్‌కు మద్దతుగా ఆదివారం ఢిల్లీలో ఇండియా కూటమి మహా ర్యాలీకి సిద్ధపడింది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం, పోలీసుల నుంచి అనుమతి లభించినట్లు సమాచారం. అన్ని పార్టీలకు చెందిన నేతలు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్ట్‌ను అమెరికా సహా ఐక్యరాజ్యసమితి తప్పుపట్టింది. ఇక తమ దేశ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని కేంద్రం స్పష్టం చేసింది.

తాజావార్తలు
-
Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
-
Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
-
Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
-
Nani: “శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా”: నాని
-
AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?