NTV Telugu Site icon

Jana Reddy: తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అంతం కావాలి..

Janareddy

Janareddy

Jana Reddy: తనను 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్రంలో మంచి పేరు తెచ్చి పెట్టారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి పేర్కొన్నారు. ఒకట్రెండు సార్లు నన్ను ఒడించినా మీ హృదయాల్లో సుస్థిర స్థానం ఇచ్చారన్నారు. నందికొండ మున్సిపాలిటీ నుంచి పలువురు కౌన్సిలర్లు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సాగర్ ప్రజలు విద్యుత్ బిల్లులు మాఫీ చేసింది తానేనని జానారెడ్డి తెలిపారు.

Also Read: PM Modi: ఈ నెల 11 న రాష్ట్రానికి మరోసారి ప్రధాని మోడీ

బుద్ధవనం గుంటూరు జిల్లాకు వెళ్లకుండా తానే సాగర్‌కు రప్పించానన్నారు. బీఆర్ఎస్ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదన్నారు. 10ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ 30లక్షల ఇళ్లు ఇస్తే.. ఇదే 10 ఏళ్లలో బీఆర్‌ఎస్ పార్టీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను తప్పక అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. రైతులకు రుణమాఫీ చేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అంతం కావాలని జానారెడ్డి అన్నారు. నాగార్జున సాగర్ అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. తన చిన్న కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్ధి జైవీర్‌ను కూడా ఆదరించాలని కోరారు.