రామ మందిరంపై స్మారక తపాలా స్టాంపును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విడుదల చేశారు. దాంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముడిపై విడుదల చేసిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రారంభించారు. తపాలా స్టాంపు రూపకల్పనలో రామాలయం, చౌపాయి 'మంగల్ భవన్ అమంగల్ హరి', సూర్య, సరయూ నది, ఆలయం చుట్టూ ఉన్న విగ్రహాలు ఉన్నాయి. ఇవి.. భారతదేశం, అమెరికాతో సహా మొత్తం 21 దేశాలలో విడుదలయ్యాయి.