NTV Telugu Site icon

Ramya: సమంత నుంచి దీపికా పదుకొణే వరకు ఇలాగే చేస్తున్నారు.. పఠాన్ మూవీపై స్టార్ హీరోయిన్ కామెంట్స్

Ramya

Ramya

Ramya says ‘Behsaram Rang’ is misogyny: షారుఖ్ ఖాన్-దీపికా పదుకొణే నటించిన పఠాన్ మూవీ వరసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. విడుదల ముందే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ‘బేషరమ్ రంగ్’ పాటలో దీపికా పదుకొణే కాషాయరంగు బికినీ ధరించడం ఈ మొత్తం వివాదానికి కారణం అవుతోంది. హిందువుల మనోభావాలను కించపరిచేలా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని వీటిని తొలగించాలని.. లేకపోతే సినిమాపై నిషేధం విధిస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నరోత్తమ్ మిశ్రా వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రం మహారాష్ట్రలో కూడా బీజేపీ ఎమ్మెల్యేలు సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: Rajnath Singh: భారత్ సూపర్ పవర్ కావాలనుకుంటోంది ఇందుకే.. చైనాకు రాజ్ నాథ్ సింగ్ స్ట్రాంగ్ రిఫ్లై

ఇదిలా ఉంటే కన్నడ స్టార్ హీరోయిన్, కాంగ్రెస్ నేత రమ్య పఠాన్ మూవీకి మద్దతుగా నిలిచింది. బేషరమ్ రంగ్ వివాదంపై స్పందించారు. ఇది స్త్రీద్వేషానికి మరో ఉదాహరణ అంటూ ట్వీట్ చేశారు. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎలా ట్రోల్ చేయబడిందో, కాశ్మీరీ పండిట్ లపై తన అభిప్రాయం వెల్లడించిన సాయి పల్లవి ఎలా ట్రోల్ చేయబడిందో, రక్షిత్ శెట్టి నుంచి విడిపోయిన రష్మిక మందన ఎలా ట్రోల్ చేయబడిందో ఇప్పుడు అలాగే దీపికా పదుకొణే డ్రెస్ పై ట్రోల్స్ చేస్తున్నారని, ప్రతీదాన్ని అందంగా విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. ‘ఫ్రీడమ్ ఆఫ్ ఛాయిస్’ మా ప్రాథమిక హక్కు అని, మహిళలు దుర్గా మాత స్వరూపం అని, స్త్రీద్వేషంపై పోరాడాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ రమ్య ట్వీట్ చేశారు.

బేషరమ్ రంగ్ పాట తీవ్ర వివాదాన్ని రేపుతోంది. ఈ సినిమాపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పలు సంఘాలు ఇందులో లవ్ జీహాద్ కోణాన్ని వెతుకుతున్నాయి. దీపికా పదుకొణే కాషాయ బికినీ ధరించడం, షారూఖ్ ఖాన్ ఆకుపచ్చ డ్రెస్ వేసుకోవడంపై కూడా చర్చను లేవనెత్తుతున్నాయి. మరోవైపు హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ బీహార్ కోర్టులో ఫిర్యాదు దాఖలైంది.