NTV Telugu Site icon

Bandi Sanjay: కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ.. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే..

Bandi

Bandi

Bandi Sanjay: కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, కాంగ్రెస్ ను నడిపించేది కేసీఆరేనని అన్నారు. అట్లాంటప్పడు కేసీఆర్ ను ఓడించడమే ధ్యేయమని చెబుతున్న నేతలు కాంగ్రెస్ లో ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ ను ఓడించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజల్లో విలువ లేదని కేటీఆరే చెబుతున్నారని.. ఆత్మాభిమానమున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలని సూచించారు. ‘‘మహా జన్ సంపర్క్ అభియాన్’’లో భాగంగా ఈరోజు లక్సెట్టిపెటలో జరిగిన మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ బహిరంగ సభకు బండి సంజయ్ తోపాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షులు రఘు, పాయల శంకర్, రాష్ట్ర కార్యదర్వి పల్లె గంగారెడ్డి తదితరులు హాజరయ్యారు.

Read Also: Adipurush: ‘ఆదిపురుష్’ సినిమాకి స్పెషల్ ఆఫర్లు.. రెండు రోజులు మాత్రమే, త్వరపడండి!

బీజేపీ మీటింగ్ ఉందంటే కేసీఆర్ సార్ పెగ్గులేసుకుని టీవీల ముందు కూసుంటడని బండి సంజయ్ విమర్శలు చేశారు. మంచిర్యాల ప్రజల్లో మస్త్ జోష్ కన్పిస్తోందని.. ఈ జోష్ ఇంకా 5 నెలలుండాలే… కేసీఆర్ అంతు చూద్దామన్నారు బండి సంజయ్. తెలంగాణ అంతటా తిరుగుతున్నానని.. టీఆర్ఎస్ మీటింగ్ లకు జనాలు ఎవరూ రావడం లేదని తెలిపారు. మోదీ పేద కుటుంబం నుండి వచ్చినోడు… పేదల కష్టాలు తెలిసినోడు. పీఎం కాగానే పేదల కష్టాలను తొలగించేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నడని బండి సంజయ్ అన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద 3 కోట్ల మందికి ఇండ్లు కట్టించారని.. మరి కేసీఆర్ ఏం చేసిండని ప్రశ్నించారు.? లక్సెట్టిపేటలో ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చారా? కొబ్బరికాయ కొట్టడానికే పరిమితమయ్యారు. మందు తాగుతూ మందిని ఎట్లా ముంచాలా? అని ఆలోచిస్తుంటడని ఆరోపించారు.

Read Also: Government Scheme : బాలికల చదువు కోసం ప్రభుత్వం ఎంత సాయం చేస్తుందో తెలుసా?

కేసీఆర్ రుణమాఫీ, నిరుద్యోగ భ్రుతి, డబుల్ బెడ్రూం ఇండ్లు, పోడు భూములకు పట్టాలు సహా అనేక హామీలిచ్చి మోసం చేశారని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గం కూడా తృప్తిగా లేదని.. అన్ని వర్గాల కోసం కొట్లాడే పార్టీ బీజేపీనని తెలిపారు. బీజేపీని కొట్టే దమ్ముకు బీఆర్ఎస్ కు లేదని.. అందుకే కాంగ్రెస్ తో కలిసి కేసీఆర్ వస్తున్నడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావడం లేదని.. దుబ్బాక నుండి మునుగోడు ఎన్నికల వరకు ఆ పార్టీ అడ్రస్ గల్లంతైందని బండి సంజయ్ ఆరోపించారు.